AP Rains: ఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచన

Rain forecast for AP for three days
x

AP Rains: ఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచన

Highlights

AP Rains: పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం

AP Rains: ఏపీలో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తాయని హెచ్చరించింది. ఇవాళ కర్నూలు, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, నంద్యాల, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో స్వల్ప వర్షాలు కురవనుండగా.. ఏలూరు, అనంతపురం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది.

రేపు అనకాపల్లి, కాకినాడ, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతితో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 25న ప్రకాశం, నంద్యాల, వైఎస్సార్, నెల్లూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలకు భారీ వర్షసూచన జారీ చేశారు. అదే రోజు పల్నాడు, శ్రీసత్యసాయి, విశాఖపట్నం, కోనసీమ, తిరుపతి జిల్లాల్లో స్వల్ప వర్షాలు పడనున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అయితే రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. రానున్న మూడు రోజులు కూడా వానలు కొనసాగనున్నాయి.

ఇక నిన్న గన్నవరంలో 6.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా.. కర్నూలు జిల్లాలో 19.2 మిల్లీమీటర్లు, నందిగామలో 7.8 మిల్లీమీటర్లు, నర్సాపూర్‌లో 2.3 మిల్లీమీటర్లు, మచిలీపట్నంలో 1.9 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories