ఇస్రో రాకెట్ ప్రయోగం విజయవంతం.. సైంటిస్టులకు అభినందనలు తెలిపిన ఇస్రో

ఇస్రో రాకెట్ ప్రయోగం విజయవంతం.. సైంటిస్టులకు అభినందనలు తెలిపిన ఇస్రో
x
Highlights

పీఎస్‌ఎల్వీ సీ-49 విజయవంతం కావడం పట్ల ఏపీ సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగాన్ని విజవంతంగా పూర్తి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను గవర్నర్ అభినందించారు.

నెల్లూరు జిల్లా శ్రీహరి కోట నుంచి పీఎస్‌ఎల్వీ సీ-49 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్‌ను సైంటిస్టులు సూర్యవర్తన కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భారత్‌కు చెందిన ఈఏఎస్‌-01తోపాటు 9విదేశీ ఉపగ్రహాలను ఇస్రో రోదసీలోకి పంపింది. పీఎస్‌ఎల్వీ సీ-49 బరువు 290 టన్నల బరువు ఉందని సైంటిస్టులు తెలిపారు. భారత్ పంపిన ఉపగ్రహం ద్వారా వాతావరణ విపత్తులు, అడవులపై పరిశోధన చేయనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.

మరోవైపు పీఎస్‌ఎల్వీ సీ-49 విజయవంతం కావడం పట్ల ఏపీ సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రయోగాన్ని విజవంతంగా పూర్తి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను గవర్నర్ అభినందించారు. శాస్త్రవేత్తలు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. కరోనా మహమ్మారి మధ్య ఇస్రో ఈ ఏడాది చేపడుతున్న మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగం ఇదే కావడం విశేషం.. ఇక ఈ మిషన్‌ పూర్తయిన వెంటనే డిసెంబర్ నాటికి కొత్త రాకెట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్‌వీ) పరీక్షించేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories