PM Modi Video Conference : ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

PM Modi Video Conference : ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌
x
వీడియో కాన్ఫరెన్స్
Highlights

PM Modi Video Conference : కోవిడ్‌ నివారణా చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

PM Modi Video Conference : కోవిడ్‌ నివారణా చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ పాల్గొన్నారు. ఆయనతో పాటు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో హోంమంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఏపీలో 25లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేశామని తెలిపారు. ప్రతి పదిలక్షలమందిలో 47,459 మందికి పరీక్షలు చేశామన్నారు. ఇప్పటి వరకు ఏపీలో మరణాలు రేటు 0.89శాతం గా ఉందన్నారు. క్లస్టర్లలోనే 85 శాతం నుంచి 90శాతం వరకూ పరీక్షలు చేస్తున్నామన్నారు. సాధ్యమైనంత త్వరగా పాజిటివ్‌ కేసులను గుర్తిస్తున్నామని ఆయన స్పష్టం చేసారు. ఇలా చేయడంవల్ల మరణాలను అదుపులో ఉంచే అవకాశం ఉంటుందన్నారు. వైద్య సదుపాయం అందించడమే కాకుండా బాధితులను ఐసోలేషన్‌ చేస్తున్నామని తెలిపారు. కోవిడ్‌ వచ్చేనాటికి వైరాలజీ ల్యాబ్‌ కూడా లేదు అని ఆయన స్పష్టం చేసారు. ఇప్పుడు ప్రతి పదిలక్షలమందికి 47వేలకుపైగా పరీక్షలు చేస్తున్నామన్నారు.

కరోనా బాధితులను వైద్య పరీక్షలు చేయడానికి గాను ప్రతి జిల్లాల్లో ల్యాబ్‌లు ఉన్నాయన్నారు. టెస్టుల విషయంలో స్వాలంబన సాధించామని ఆయన అన్నారు. దాదాపు 2 లక్షలమంది వాలంటీర్లు క్షేత్రస్థాయిలో కరోనా నివారణా చర్యల్లో పాల్గొంటున్నారన్నారు. అవసరమైన వారికి అందరికీ టెస్టులు చేస్తున్నామన్నారు. ప్రతిరోజూ 9వేల నుంచి 10వేల కేసులు నమోదువతున్నాయని స్పష్టం చేసారు. 138 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను కోవిడ్‌ ఆస్పత్రులుగా వినియోగిస్తున్నామన్నారు. దాదాపు 37వేలకుపైగా బెడ్లు ఉన్నాయని తెలిపారు. 109 కోవిడ్‌కేర్‌ సెంటర్లు ఉన్నాయి, 56వేలకుపైగా బెడ్లు ఉన్నాయన్నారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిబెడ్లు కేవలం 3286 మాత్రమే ఉండేవి అని ప్రస్తుతం 11వేలకుపైగా ఉన్నాయని స్పష్టం చేసారు. గడచిన మూడు నెలల్లో దాదాపు 7వేలకు పైగా బెడ్లు సమకూర్చుకున్నామన్నారు. అలాగే హెల్ప్‌ డెస్క్‌లను కూడా ప్రజలకు అందుబాటులో పెట్టామన్నారు. పేషెంట్లను త్వరగా అడ్మిచేయించడానికి వీరు సహాయపడుతున్నారన్నారు. ప్రతి మండలంలో 108 అంబులెన్స్‌ ఉన్నాయి. కోవిడ్‌కు ముందు 108 అంబులెన్సు›్ల 443 ఉంటే, కోవిడ్‌ సమయంలో మరో 768 అంబులెన్స్‌లు సమకూర్చుకున్నాం. 108, 104లు కలిపి కొత్తగా 1088పైగా తీసుకొచ్చామన్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్నట్టుగా మహా నగరాలు మాకు లేవు, ఆ నగరాల్లో ఉన్నట్టుగా భారీ మౌలికసదుపాయాలు ఉన్న ఆస్పత్రులూ లేవు అని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వైద్యసదుపాయాలను గణనీయంగా మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం అని తెలిపారు.




Show Full Article
Print Article
Next Story
More Stories