Pramod Kumar Dubey: స్కిల్ ఎక్విప్‌మెంట్ ధరను నిర్ధారించిన కమిటీలో చంద్రబాబు లేరు

Pramod Kumar Dubey Comments On Chandrababu Skill Development Case
x

Pramod Kumar Dubey: స్కిల్ ఎక్విప్‌మెంట్ ధరను నిర్ధారించిన కమిటీలో చంద్రబాబు లేరు 

Highlights

Pramod Kumar Dubey: కేబినెట్ నిర్ణయంపై చంద్రబాబుపై కేసు ఎలా పెడతారు..?

Pramod Kumar Dubey: చంద్రబాబు పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ కొనసాగుతోంది. బెయిల్, కస్టడీ పిటిషన్లపై ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వివిపిస్తున్నారు. స్కిల్ స్కామ్‌ కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవని.. అప్పటి ఆర్థికశాఖ ఉన్నతాధికారి.. గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారన్నారు చంద్రబాబు తరపు లాయర్ ప్రమోద్ కుమార్ దూబే. అధికారి అధ్యయనం చేసి.. సీమెన్స్ ప్రాజెక్ట్‌కు ఎలాంటి అభ్యంతరం తెలపలేదన్నారు.

సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం లేకుండా.. ఆమోదం పొందిందన్న విషయమై ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. స్కిల్ ఎక్విప్‌మెంట్ ధరను నిర్ధారించిన కమిటీలో చంద్రబాబు లేరన్న దూబే.. కమిటీలో ఉన్న భాస్కరరావు మధ్యంతర బెయిల్‌పై ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని.. అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేపట్టారన్నారు. ఇప్పుడు మళ్లీ కస్టడీ కావాలంటున్నారు.‍. అవసరం ఏముందని వాదించారు. ఇక కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చిందన్న దూబే.. కేబినెట్ నిర్ణయంపై చంద్రబాబుపై కేసు ఎలా పెడతారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories