Pragati Bharat Foundation: ఏపీలో అందుబాటులోకి రానున్న మరో 300 ఆక్సిజన్ బెడ్స్

Pragathi Bharat Foundation to set up 300 Oxygen Beds Facility in Vizag
x

Pragati Bharat Foundation: ఏపీలో అందుబాటులోకి రానున్న మరో 300 ఆక్సిజన్ బెడ్స్

Highlights

Pragati Bharat Foundation: ఏపీలో మరో 300 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి రానున్నాయి.

Pragati Bharat Foundation: ఏపీలో మరో 300 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి రానున్నాయి. సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ షీలానగర్‌లో కోవిడ్ వైద్య సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులను ఎంపీ విజయసాయి రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. కరోనా రోగులకు అవసరమైన అత్యవసర వైద్యసాయాన్ని ఈ కేంద్రంలో అందజేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రాంగణానికి బెడ్స్ చేరుకున్నాయి. ఆక్సిజన్ సరఫరా ఏర్పాట్లు కూడా చకచక జరుగుతున్నాయి. సోమవారం నాటి కల్లా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, ఫౌండేషన్ సభ్యులను విజయసాయి రెడ్డి ఆదేశించారు.

కోవిడ్ వైద్య సేవల కేంద్రంలో వైద్యం, మందులతోపాటు రోగులకు మూడు పూటలా మంచి భోజనం అందించనున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. వైద్యం తీసుకునే రోగుల సమాచారాన్ని ఎప్పటికప్పడు వారి బంధువులకు అందజేస్తామంటున్నారు.

ఖర్చుకు వెనకాడకుండా, రోగులకు మంచి వైద్యం అందించే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని విజయసాయి రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం ఆంధ్రా మెడికల్ కాలేజీ వైద్య సిబ్బంది, జిల్లా వైద్య అధికారుల సహకారం తీసుకొనున్నట్టు విజయసాయిరెడ్డి తెలిపారు. ఆంధ్ర మెడికల్ కాలేజీ, కిమ్స్, విమ్స్, డీఎంహెచ్‌వో వైద్యులు సిఫార్సు చేసిన రోగులతో పాటు, కారోనా బారినపడిన వారు నేరుగా ఈ కేంద్రానికి వచ్చి వైద్యం చేయించుకోవచ్చని ఆయన తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories