ఆంధ్రా- ఒడిశా బోర్డర్‌లో ఉద్రిక్తత.. కోడిగుడ్ల లారీల అడ్డగింత.. రైతుల ఆందోళన..!

Poultry Farmers Protest At Andhra Odisha Border
x

ఆంధ్రా- ఒడిశా బోర్డర్‌లో ఉద్రిక్తత.. కోడిగుడ్ల లారీల అడ్డగింత.. రైతుల ఆందోళన..!

Highlights

Andhra Odisha Border: ఒడిస్సాలోని ఏపీకి చెందిన లారీలను ఆపివేయడంతో జాతీయ రహదారి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Andhra Odisha Border: ఒడిస్సాలోని ఏపీకి చెందిన లారీలను ఆపివేయడంతో జాతీయ రహదారి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏపీ నుంచి కోడి గుడ్ల లారీలను జాతీయ రహదారిపై ఖుర్దారోడ్ వద్ద అడ్డుకున్నారు. దాదాపు 200 లారీల వరకు నిలిచిపోయి ఉంటాయని తెలుస్తోంది. ఏపీ ఎగ్ ట్రేడర్స్‌తో ఒడిస్సా అధికారులు చర్చించినా సమస్య కొలిక్కిరాలేదు. ఎండ వేడిమికి గుడ్లు పాడవుతాయని ఏపీ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 36 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాల గుడ్లను ఒడిషాలోకి రాకుండా అడ్డుకొని ధరలు పెంచుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, బీహార్‌ రాష్ట్రాలకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. గుడ్ల ఎగుమతులను అడ్డుకోవడంపై కేంద్రం చొరవ తీసుకోవాలంటున్నారు ఏపీ ఎగ్ ట్రేడర్స్.

Show Full Article
Print Article
Next Story
More Stories