AP News: ఏపీలో రోజురోజుకు హీటెక్కుతున్న పాలిటిక్స్

Politics Is Heating Up Day By Day In AP
x

AP News: ఏపీలో రోజురోజుకు హీటెక్కుతున్న పాలిటిక్స్

Highlights

AP News: తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని చురకలు

AP News: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ నాటినుంచి ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కాయి. కుట్ర పూరితంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారంటూ టీడీపీ, జనసేన, సహా ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై విమర్శల దాడి చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం కాస్త ఢిల్లీకి చేరింది. నారా లోకేష్ రెండ్రోజులుగా హస్తినలోనే మకాం వేశారు. తన తండ్రిని అక్రమంగా అరెస్టు చేశారంటూ జాతీయ మీడియా ద్వారా తెలియజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

చంద్రబాబు అరెస్ట్ అంశంపై తీవ్రస్థాయిలో రెస్పాండ్ అయ్యారు సీఎం జగన్. అవినీతి కేసులో ఆధారాలతో చంద్రబాబు అరెస్టయ్యారన్నారు. తప్పు చేసి అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిని కొందరు కాపాడేందుకు ప్రయ్నతిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఎన్నో మోసాలకు పాల్పడ్డారని.. ఇన్నాళ్లు చంద్రబాబును పలుకుబడి కలిగిన ముఠా కాపాడింది అంటూ సీఎం జగన్ ఆరోపించారు.

చంద్రబాబు అరెస్టయినా.. ప్రశ్నిస్తానన్న వ్యక్తి ప్రశ్నించడంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు సీఎం జగన్.. అవినీతి పరుడికే మద్దతిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఎంత దోపిడీ చేసినా, ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా చంద్రబాబును రక్షించుకునేందుకు కొందరు ప్రయత్నించినా.. చట్టం ఎవరికైనా ఒక్కటేనని వైఎస్ జగన్ స్పష్టంచేశారు.

మరో వైపు వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ, జనసేనలు ఉమ్మడి కార్యాచరణలు ప్రకటించాయి. వైసీపీని ఎదుర్కొనేందుకు కలిసి పనిచేస్తామంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. వైసీపీని ఓడించడానికి టీడీపీతో జట్టు కడుతున్నట్లు ప్రకటించారు. నిన్న అమరావతిలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో రెండు తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. మరో వైపు ఏపీ రాజకీయాలపై కేంద్ర పెద్దలను కలిసి ఫిర్యాదు చేస్తానంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories