పవన్ వారాహి టూర్‌తో హీటెక్కిన పాలిటిక్స్‌

Politics Heated up with Pawan Varahi Tour
x

పవన్ వారాహి టూర్‌తో హీటెక్కిన పాలిటిక్స్‌

Highlights

*తన పర్యటనలో పవన్‌కళ్యాణ్‌ ద్వారంపూడిపై విమర్శలు చేయగా.. ద్వారంపూడి నుంచి అదే రేంజ్‌లో కౌంటర్లు వచ్చాయి.

Andhra Pradesh: ఏపీలో రాజకీయాలన్నీ కాపుల చుట్టూ తిరుగుతున్నాయి. పవన్ వారాహి టూర్‌తో రాష్ట్రంలో పాలిటిక్స్‌ హీటెక్కాయి. తన పర్యటనలో పవన్‌కళ్యాణ్‌ ద్వారంపూడిపై విమర్శలు చేయగా.. ద్వారంపూడి నుంచి అదే రేంజ్‌లో కౌంటర్లు వచ్చాయి. ఆ తర్వాత కాపు ఉద్యమ నేత ముద్రగడ లేఖ రాయడంతో రాజకీయమంతా కాపుల చుట్టే తిరుగుతోంది. కాపు నేతల తాజా స్టేట్‌మెంట్లు కూడా ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. ముద్రగడ తీరుపై కాపు నేతలు మండిపడుతున్నారు.

తన స్వార్థ ప్రయోజనాల కోసం.. కాపు జాతిని కించపరచొద్దంటున్నారు. కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో సమావేశమైన కాపు నేతలు.. ముద్రగడ కాపు ద్రోహి అన్నారు. ముద్రగడ పద్మనాభం వల్ల కాపుజాతికి ఒరిగిందేమీ లేదని.. మరోసారి లేఖలు రాస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అమాయకులైన కాపులను ముందుపెట్టి కడప బ్యాచ్ తో తునిలో రైలు దహనం చేయడం నిజంకాదా అంటూ ముద్రగడను ప్రశ్నిస్తున్నారు కాపు నేతలు. ముద్రగడపై నిరసనలకు సన్నాహాలు చేస్తున్నారు. నిన్న పవన్ మీటింగ్‌లో కూడా కులద్రోహి అంటూ ముద్రగడపై పోస్టర్లు ప్రదర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories