Sambasiva Raju: మాజీ ఎమ్మెల్యే సాంబశివరాజు మృతి పట్ల నివాళి అర్పించిన వైసీపీ శ్రేణులు..
Sambasiva Raju: ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎంతో మంది నాయకులను తయారు చేసిన రాజకీయ కురువృద్ధుడు, మనందరి మార్గదర్శి పెనుమత్స సాంబశివరాజు..
Sambasiva Raju: ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎంతో మంది నాయకులను తయారు చేసిన రాజకీయ కురువృద్ధుడు, మనందరి మార్గదర్శి పెనుమత్స సాంబశివరాజు మనకు దూరం కావడం చాలా విచారకరమని విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం విజయనగరం జిల్లా గుర్ల మండల కేంద్రంలో కెల్ల జంక్షన్ వద్ద ఉత్తరాంధ్ర విద్యార్థి సేన, వైకాపా రాష్ట్ర ప్రచార విభాగం సంయుక్త ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సుంకరి రమణ మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా సాంబశివరాజుఅమర్ రహే అంటూ నినాదాలు చేశారు. తర్వాత దివంగత నేత సాంబశివరాజు ఫోటోకు పూల మాలలువేసి నివాళులర్పించారు. ఈ సంతాప సభలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎంతోమందిని పార్టీల నాయకులుగా తయారు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
బడుగు బలహీన వర్గాల నుంచి ఎంతో మంది నేతలను గల్లీ నుంచి ఢిల్లీ వరకు పంపించిన కురువృద్ధులు సాంబశివరాజులేని లోటు తీరనిది ఆయన కన్నీరుమున్నీరయ్యారు. అయితే వారి సేవలకు గుర్తింపుగా సీఎం ఆయన కుమారుడు సురేష్ బాబుకు ఎమ్మెల్సీ కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం సహకార బ్యాంకు మాజీ చైర్మన్ చనుమల్ల వెంకటరమణ మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాలలో బడి గుడి నీరు సాగునీరు తాగునీరు ఆస్పత్రులు రోడ్లు తదితర వాటిని పూర్తి చేసిన ఘనుడు సాంబశివుడు అని గుర్తు చేశారు. ఈప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపించే నాయకుడు అని కొనియాడారు. సామాన్య కుటుంబంలో పుట్టిన తమలాంటి ఎంతో మందిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తిగా కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా వైయస్సార్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి రేగానశ్రీనివాసురావు మాట్లాడుతూ,బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేసిన మహనీయుడు ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర విద్యార్థి సేనఅధ్యక్షుడు డాక్టర్ సుంకరి రమణమూర్తి మాట్లాడుతూ,ఈ ప్రాంతంలో రాజకీయ గురువుగా సాంబశివ రాజుని కొలుస్తారని ఆయన అన్నారు మహనీయుడు అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడిచి పార్టీ అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఆయన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమం తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వైయస్ఆర్ పార్టీ నాయకులు పల్లి.కృష్ణ , మంత్రి వెంకటరమణ , అట్టాడ లక్ష్మీనాయుడు నాయుడు చందక బంగారు నాయుడు, రమణ గిడిజల శ్రీను భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రాజు, తెట్టింగి మాజీ సర్పంచ్ జమ్ము స్వామినాయుడు, సంఛాన రమేష్ సుంకరినారాయణరావు తెట్టంగి, రాగోలు, గుజ్జంగివలస, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కుమారుడు సురేష్ బాబుకు ఎమ్మెల్సీ
దివంగత సీనియర్ నాయకులు, విజయనగరం జిల్లాకు చెందిన పెన్మత్స సాంబశివరాజు తనయుడైన డా.పెన్మత్స సూర్యనారాయణరాజు (డా.సురేష్‌బాబు)ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దింపాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయించారు. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటుకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఈ స్థానానికి సురేష్ బాబు పేరును ఖరారు చేశారు. కాగా ఏపీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటాలోని ఒక ఎమ్మెల్సీ స్థానం భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. నామినేషన్ దాఖలుకు ఆగస్ట్ 13 చివరి తేదీ కాగా, 24న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడిస్తారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire