ఏపీలో రచ్చ రచ్చ.. నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్న టీడీపీ, వైసీపీ

Political Heat In Andhra Pradesh
x

ఏపీలో రచ్చ రచ్చ.. నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్న టీడీపీ, వైసీపీ

Highlights

Andhra News: ఏపీలో హీటెక్కిన పాలిటిక్స్

Andhra News: ఏపీలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. నువ్వానేనా అన్నట్లు అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయి. డూ ఆర్ డై అన్నట్లు ముంచుకొస్తున్న 2024 ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అటు ప్రభుత్వ వైఫల్యాలపై వరుస కార్యక్రమాలతో కార్యాచరణ ప్రారంభించింది టీడీపీ. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఎదురుదాడికి దిగింది అధికార వైసీపీ పార్టీ. టీడీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ చంద్రబాబుకు ఐటీ నోటీసుల అంశాన్ని అస్ర్తంగా మలుచుకొని ముప్పేట దాడికి దిగుతున్నారు వైసీపీ నేతలు.

ఇక చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ప్రతిపక్ష టీడీపీ, అధికార వైసీపీపై విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి నోటీసులు ఇప్పించారని ఆరోపించింది. మరో వైపు ఐటీ నోటీసులకు చంద్రబాబు సమాధానం కూడా ఇచ్చారని టీడీపీ నేతలు తెలిపారు. మరో వైపు ఐటీ నోటీసులు సాధారణమే అంటూ వ్యాఖ్యానించారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఈ ఐటీ నోటీసుల వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మరో వైపు తనను అరెస్టు చేయొచ్చంటూ చంద్రబాబు అనంతపురం పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్‌లో ఆసక్తిని కలిగిస్తున్నాయి. జగన్‌ పాలనలో అన్నీ అరాచకాలేనని.. ప్రజాసమస్యలపై మాట్లాడితే రౌడీలతో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే తనను అరెస్టు చేసినా చేస్తారన్నారు. తనపై దాడులు కూడా చేస్తారని.. వ్యవస్థలను అడ్డంపెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు.

అసలు చంద్రబాబును ఎవరు అరెస్ట్ చేస్తారు? ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఒకవేళ అరెస్ట్ చేస్తే ఏ కేసులలో అరెస్ట్ చేస్తారన్నది మాత్రం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సస్పెన్స్‌గా మారింది. మరి టీడీపీ, వైసీపీ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చలేంటి? ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తున్నారు? ఆయా శిబిరాల్లో జరుగుతున్న పొలిటికల్ ప్లాన్స్ ఏంటనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories