Riti Saha Case: రీతి సాహ కేసులో దూకుడు పెంచిన విశాఖ పోలీసులు..

Police Increased Aggressiveness In Riti Saha Case
x

Riti Saha Case: రీతి సాహ కేసులో దూకుడు పెంచిన విశాఖ పోలీసులు.. 

Highlights

Riti Saha Case: సాధనా హాస్టల్‌ వార్డెన్‌ కుమారి, యజమాని సూర్యకుమారి అరెస్ట్

Riti Saha Case: విశాఖలో సంచలనం సృష్టించిన ఇంటర్‌ బాలిక అనుమానాస్పద మృతి కేసులో అరెస్టులు ప్రారంభమయ్యాయి. పశ్చిమ బెంగాల్ కు చెందిన రితీ సాహా.. నరసింహానగర్‌లోని సాధనా హాస్టల్‌ మేడపై నుంచి కిందపడి గత నెల 14న మృతి చెందింది. అయితే తమ కుమార్తె మృతి కేసులో అనుమానాలున్నాయంటూ ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదిచ్చినా విశాఖ పోలీసులు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ కేసు మలుపులు తిరిగి వెస్ట్‌ బెంగాల్‌ సీఎం, డీజీపీ, సీఐడీ విభాగాల వరకు వెళ్లింది.

అయితే.. వారంతా స్పందించి విశాఖలో తిరిగి దర్యాప్తునకు ఆదేశించారు. దీంతో.. ఈ కేసును తిరిగి దర్యాప్తు ప్రారంభించాలంటూ ఈస్ట్‌ ఏసీపీ మూర్తికి నగర పోలీస్‌ కమిషనర్‌ త్రివిక్రమ్‌ వర్మ అప్పగించారు. ఈ నేపథ్యంలో బాలిక మృతి కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ సాధనా హాస్టల్‌ వార్డెన్‌ కుమారి, యజమాని సూర్యకుమారి, బైజూస్‌ ఆకాశ్‌ కళాశాల మేనేజర్‌ రాజేష్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ రవికాంత్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. వారిపై ఐపీసీ సెక్షన్‌ 304, పార్ట్‌-2 కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories