Prime Minister Narendra Modi: ఇవాళ రాత్రికి విశాఖకు ప్రధాని మోడీ..!

pm modi vizag tour
x

 ఇవాళ రాత్రికి విశాఖకు ప్రధాని మోడీ

Highlights

* పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న ప్రధాని

Prime Minister Modi: ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. కర్నాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణలో ఇవాళ, రేపు ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ముందుగా బెంగళూరులోని కెంపేగౌడ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌-2ను మోడీ ప్రారంభిస్తారు. అనంతరం చెన్నై-మైసూర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత 108 అడుగుల కెంపేగౌడ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు మోడీ. అక్కడి నుంచి తమిళనాడు దిండిగల్‌కు ప్రధాని చేరుకుంటారు. దిండిగల్‌ గాంధీగ్రామ్‌ రూరల్‌ ఇన్‌స్టిట్యూట్‌ 36వ కాన్వొకేషన్‌కు హాజరవుతారు మోడీ. ఆ తర్వాత విద్యార్థులనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి ఏపీకి చేరుకోనున్న మోడీ రాత్రికి విశాఖలో బస చేయనున్నారు.

రేపు విశాఖలో ONGC యూ ఫీల్డ్‌ ఆన్‌షోర్‌ డీప్‌ వాటర్‌ బ్లాక్‌ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు ప్రధాని మోడీ. 6 లేన్‌ గ్రీన్‌ఫీల్డ్‌ రాయ్‌పూర్‌-విశాఖ ఎకనామిక్‌ కారిడార్‌కు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే విశాఖ రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన చేస్తారు. వాటితో పాటు శ్రీకాకుళం అంగుల్‌ నేచురల్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని. ఈ కార్యక్రమాల్లో సీఎం జగన్‌ కూడా పాల్గొననున్నారు. ఇక ఏపీలో మోడీ పర్యటన ఉత్కఠంగా మారింది. ఓ వైపు నిరసలు మరోవైపు కట్టుదిట్టమై భద్రత మధ్య మోదీ పర్యటన కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి కీలకమైన అంశాలపై స్పష్టత ఇవ్వాలని ప్రజా సంఘాలు పట్టుబడుతుంటే ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమని చెప్పి, డిమాండ్లపై స్పందించే పరిస్ధితి లేదని క్లారిటీ ఇవ్వడంతో ప్రజా సంఘాలు నిరసన గళాన్ని ఉదృతం చేసే దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నాయి. ఒకే వేదికపైకి ప్రధాని మోడీ, సీఎం జగన్‌ కూడా రానుండడంతో ఆందోళన ఉధృతం చేసేందుకు నిరసన కారులు సిద్ధమవుతున్నారు.

మరోవైపు మోడీ రాకకు మరికొద్ది గంటలే మిగిలి ఉండడంతో అధికారులు భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. విశాఖలో మూడంచెల సెక్యూరిటీ వ్యవస్థతో పహారా కాస్తున్నారు. ప్రధాని రాక నేపథ్యంలో జిల్లా అధికారులు, పోలీసులు అడుగడునా భద్రతను పెంచారు. విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉక్కు కార్మికులు, వామపక్షాలు, ప్రజాసంఘాలు చేపట్టిన ర్యాలీపై ఇప్పటికే పోలీసులు ఆంక్షలు పెట్టారు. సాగర తీరం నిరసనలతో హోరెత్తే పరిస్థితి ఉండడంతో, నగరాన్ని అడుగడుగునా జల్లెడ పడుతోంది స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌. ఓ వైపు విశాఖ స్టీల్‌ప్లాంట్‌, మరోవైపు విశాఖ రైల్వే జోన్, ఏపీకి ప్రత్యేక హోదా, మూడు రాజధానుల వ్యవహారం. ఇలా అనేక అంశాలు ఉత్కంఠ పెంచుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఇవాళ ప్రధాని మోడీతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌ నుంచి విశాఖకు వెళ్లనున్నారు పవన్‌. రాత్రి 8 గంటల 30 నిమిషాలకు విశాఖ ఐఎన్‌ఎస్‌ చోళాలో ఇరువురి భేటీ జరగనుంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానితో జనసేనాని చర్చించనున్నారు. బీజేపీ-జనసేన మైత్రి, బీజేపీ రోడ్‌ మ్యాప్‌పై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories