టీటీడీ సిబ్బంది నిజాయితీ.. భక్తురాలి బంగారు ఆభరణాన్ని అప్పగింత..

Pilgrim Gold Ornament Handed Over by TTD Staff
x

టీటీడీ సిబ్బంది నిజాయితీ.. భక్తురాలి బంగారు ఆభరణాన్ని అప్పగింత..

Highlights

టీటీడీ సిబ్బంది నిజాయితీ.. భక్తురాలి బంగారు ఆభరణాన్ని అప్పగింత..

Tirumala: తిరుమలలో భక్తులు పొరపాటున వదిలి వెళ్లిపోయిన బంగారాన్ని పారిశుధ్య కార్మికులు తిరిగి అప్పగించి నిజాయతీ చాటుకున్నారు. నిజామాబాద్‌కు చెందిన భక్తులు విష్ణుపాదం గృహంలో గదిని అద్దెకు తీసుకున్నారు. శ్రీవారి దర్శనం ముగించుకుని వెళ్లిపోయారు. గదిని శుభ్రపరిచేందుకు వెళ్లిన పారిశుధ్య కార్మికులు రూ.2 లక్ష విలువైన బంగారు మంగళ సూత్రాన్ని గుర్తించారు. టీటీడీ ఓఎస్డీ రామకృష్ణకి సమాచారం ఇచ్చారు. వారి ఫోన్​నెంబర్​తో సమాచారం అందించారు. చివరికి భక్తులు తిరిగి తిరుమల చేరుకున్నారు. వారికి అధికారులు ఆభరణాన్ని అప్పగించారు. టీటీడీ సిబ్బంది నిజాయతీని కొనియాడిన భక్తులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమయంలో ఎంబీసీ టీటీడీ సూపరింటెండెంట్ దయాకర్, టీటీడీ మేనేజర్ రాంబాబు వున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories