Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో పెట్రోల్ కష్టాలు

Petrol Pump in Srikakulam District | AP News
x

శ్రీకాకుళం జిల్లాలో పెట్రోల్ కష్టాలు

Highlights

Srikakulam: రెండు రోజులుగా దొరకని డీజిల్, పెట్రోల్

Srikakulam: నో స్టాక్ శ్రీకాకుళం జిల్లాలోని పలు పెట్రోల్ బంకుల వద్ద సమాధానం ఇది. నో స్టాక్ అనే బోర్డులు మాత్రం డిస్ ప్లే చేయడంలేదు కానీ వచ్చిన కస్టమర్లకు మాత్రం రేపు అనే సమాధానమే చెబుతున్నారు. మరోవైపు డబ్బులు కట్టినా చమురు సంస్థలు పెట్రోల్ సరఫరా చేయడంలేదని బంకు యజమానులు చెబుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో పెట్రోల్‌ స్టాక్ లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల పెట్రోల్‌ బంకులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వచ్చిన వారికి రేపు అనే సమాధానమే చెబుతున్నారు. ప్రస్తుతానికి జిల్లాలో తాత్కాలికంగా, పరిమితంగా ఇండియన్ ఆయిల్ బంకులో మాత్రమే పెట్రోల్ ఉంది. అక్కడ కూడా ఎప్పుడు పెట్రోల్ నిల్వలు అయిపోతాయో తెలియని పరిస్థితి.

జిల్లాలో 30 మండలాల్లో ఉన్న బంకులలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. నగరంలోని పోలీసులు ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియన్ పెట్రల్ బంకు వద్ద మాత్రమే పెట్రోల్ దొరకడంతో నగరవ వాసులు అక్కడ బారులు తీరారు. మరో మూడు రోజుల వరకూ పెట్రోల్ దొరకదనే ప్రచారం జిల్లా వ్యాప్తంగా వినిపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మూడ్రోజుల క్రితమే చమురు సంస్థకు డబ్బులు కట్టామని కానీ ఇంతవరకూ స్టాక్ రాలేందంటున్నారు పెట్రోల్ బంక్ యాజమానులు. ధరలు పెంచడంలో ఉన్న శ్రద్ధ పెట్రోల్ సరఫరా, నిల్వలపై కూడా ఉండాలని శ్రీకాకుళం జిల్లా వాసులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లాలో ఆయిల్ కొరత తీర్చాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories