బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపికపై మళ్లీ రాజుకున్న వివాదం

Petition Filed in High Court Over Successor of Brahmamgari Matham
x

మారుతీ మహాలక్ష్మమ్మ

Highlights

Brahmamgari Matam: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపికపై మళ్లీ వివాదం రాజుకుంది.

Brahmamgari Matam: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపికపై మళ్లీ వివాదం రాజుకుంది. మఠాధిపతిగా వెంకటాద్రి స్వామి నియమకాన్ని నిలిపివేయాలని దేవాదాయశాఖపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు వెంకటేశ్వరస్వామి రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ. తనపై ఒత్తిడి తెచ్చి రాజీ చేశారని పిటిషన్‌లో తెలిపారు. వీలునామా ప్రకారం కాకుండా స్థానిక ఎమ్మెల్యే, దేవాదాయశాఖతో మఠాధిపతిని ప్రకటించారని మహాలక్ష్మమ్మ అన్నారు.

ఇటీవలే వెంకటాద్రిస్వామి పేరును పీఠాధిపతిగా ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ ఆజాద్, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో వెంకటాద్రిస్వామి పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టే తరుణంలో హైకోర్టును ఆశ్రయించారు మారుతీ మహాలక్ష్మి. దీంతో వీరబ్రహ్మం గారి మఠం వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories