రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసుల విచారణకు హాజరైన పేర్ని జయసుధ

Perni Jayasudha Attends Investigation in Ration Rice Case
x

రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసుల విచారణకు హాజరైన పేర్ని జయసుధ

Highlights

పేర్ని జయసుధ(Perni Jayasudha) మచిలీపట్టణం పోలీస్ స్టేషన్ (Machilipatnam Police station) కు హాజరయ్యారు.

పేర్ని జయసుధ(Perni Jayasudha) మచిలీపట్టణం పోలీస్ స్టేషన్ (Machilipatnam Police station) కు హాజరయ్యారు. రేషన్ బియ్యం మాయమైన కేసులో విచారణకు రావాలని జయసుధకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి పేర్ని నాని భార్య యసుధకు చెందిన గోడౌన్ లో పీడీఎస్ బియ్యం మాయమైంది. అధికారుల విచారణలో 387 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైంది. తొలుత 187 మెట్రిక్ టన్నుల బియ్యానికిగాను 1.68 కోట్లు జరిమానా చెల్లించారు. మొత్తం 387 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైన విషయాన్ని అధికారులు గుర్తించారు. ఇందుకు గాను ఇంకా రూ. 1.67 కోట్లు చెల్లించాలని అధికారులు ఆదేశించారు.

తమ గోడౌన్ లో రేషన్ బియ్యం తక్కువగా ఉన్నాయని పేర్ని జయసుధ 2023, నవంబర్ 27న పౌరసరఫరాల శాఖ అధికారులకు లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా అధికారులు సోదాలు నిర్వహించారు. బియ్యం తక్కువగా ఉన్న విషయమై సివిల్ సప్లయిస్ అధికారుల ఫిర్యాదు మేరకు మచిలీపట్టణం పోలీసులు జయసుధపై డిసెంబర్ 11న కేసు నమోదు చేశారు.

ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించారు. 2023, డిసెంబర్ ౩౦న కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరైంది. అయితే ఈ కేసులో జయసుధ భర్త మాజీ మంత్రి పేర్నినానిని ఏ 6 గా చేర్చారు. దీనిపై ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

ఏపీ హైకోర్టు ఈ నెల 6 వరకు ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. రేషన్ బియ్యం అక్రమాలకు చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని గోడౌన్లను తనిఖీలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ విషయం వెలుగు చూసింది. రాజకీయ కక్షతోనే ఈ కేసును నమోదు చేశారని పేర్ని నాని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను అధికారపక్షం కొట్టిపారేసింది. రేషన్ బియ్యం తక్కువగా ఉందని లేఖలు రాసిందెవరు.. జరిమానా చెల్లించిదెవరని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories