Payyavula Keshav: ఎన్నో ఏళ్ల డ్రీమ్ నెరవేరిన వేళ.. తొలిసారి మంత్రి పదవి.. ఆపై అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన పయ్యావుల

Payyavula Kesav Tables AP Budget for the First Time
x

Payyavula Keshav: ఎన్నో ఏళ్ల డ్రీమ్ నెరవేరిన వేళ.. తొలిసారి మంత్రి పదవి.. ఆపై అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన పయ్యావుల

Highlights

Payyavula Keshav: పయ్యావుల కేశవ్... తొలిసారి మంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయాల్లో కేశవ్ కు మంత్రి పదవి దక్కలేదు.

Payyavula Keshav: పయ్యావుల కేశవ్... తొలిసారి మంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయాల్లో కేశవ్ కు మంత్రి పదవి దక్కలేదు. 2024 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ దఫా తెలుగుదేశంలో సీనియర్లను చంద్రబాబు పక్కన పెట్టారు. మంత్రివర్గంలో కూడా కొత్తవారికి అవకాశం కల్పించారు. 2019-24 వరకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులుగా ఆయన కొనసాగారు.

ఈసారి చంద్రబాబు కేబినెట్ లో పయ్యావుల కేశవ్ కు అవకాశం దక్కింది. ఆర్ధిక శాఖ ఆయనకు దక్కింది. తొలిసారిగా ఆయన ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ టీ ఆర్ బతికున్న సమయంలో పయ్యావుల కేశవ్ కి 1994లో టీడీపీ టిక్కెట్టు లభించింది. ఆ ఎన్నికల్లో ఆయన గెలిచారు.1999 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 2004, 2009 ఎన్నికల్లో ఆయన గెలిచారు.2014 ఎన్నికల్లో ఆయన ఓడారు. 2019, 2024 ఎన్నికల్లో గెలిచారు.

1994లో తొలిసారిగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో ఏపీలో మరోసారి టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో కేశవ్ ఓడిపోయారు. 2004 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. కానీ, ఆయన గెలిచారు.2009లో కూడా ఆయన గెలిచారు. అప్పుడు కూడా టీడీపీ అధికారానికి దూరమైంది. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. కానీ, ఆ ఎన్నికల్లో వై.విశ్వేశ్వర రెడ్డి చేతిలో ఆయన ఓడారు.

ఆ ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి పరిటాల సునీత, పల్లె రఘునాథ రెడ్డిలకు మంత్రి పదవులు దక్కాయి. 2019లో టీడీపీ అధికారానికి దూరమైంది. కానీ, ఈ ఎన్నికల్లో ఆయన గెలిచారు. అయితే ఈ సమయంలో చంద్రబాబు ఆయనకు పీఏసీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు కేబినెట్ లో కేశవ్ కు మంత్రి పదవి దక్కింది. ఆర్థికశాఖను చంద్రబాబు ఆయనకు కేటాయించారు. దీంతో తొలిసారిగా ఆయన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories