Sajjala: చంద్రబాబు డిసైడ్‌ చేస్తారు.. పవన్‌ ఫాలో అవుతారు

Pawan Will Do Whatever Chandrababu Says Sajjala Ramakrishna Reddy Says
x

Sajjala: చంద్రబాబు డిసైడ్‌ చేస్తారు.. పవన్‌ ఫాలో అవుతారు

Highlights

Sajjala: అందుకోసం పవన్ ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారు

Sajjala: రాబోయే ఎన్నికల్లో ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా తాము సిద్ధంగా ఉన్నామని వైసీపీ ప్రకటిస్తోంది. సింహం సింగిల్‌గానే వస్తుందని వైసీపీ నేతలంటున్నారు. వైనాట్ 175 లక్ష్యంగా పని చేస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలో ఏర్పడే పొత్తులపై వైసీపీకి క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపై టీడీపీ, జనసేనలపై వైసీపీ నేతల అటాక్ ముమ్మరం కానున్నట్లు తెలుస్తోంది. జనసేనాని వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. జగన్‌ను గద్దె దించడమే లక్ష్యమని పవన్ చాలాసార్లు చెప్పారన్నారు. చంద్రబాబు, పవన్‌ ఎప్పటి నుంచో కలిసే ఉన్నారని చెప్పారు. చంద్రబాబు ఏం చెబితే పవన్ అది చేస్తారని...అందుకోసం పవన్ ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారని అన్నారు. చంద్రబాబు డిసైడ్‌ చేస్తారు.. పవన్‌ ఫాలో అవుతారని సజ్జల ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories