Pawan Kalyan: కనకదుర్గ గుడి మెట్లు శుభ్రం చేసిన పవన్...వాళ్లిద్దరికీ స్ట్రాంగ్ వార్నింగ్

Pawan Kalyan visits Kanakadurga temple in Vijayawada prayaschitta deeksha
x

Pawan Kalyan: కనకదుర్గ గుడి మెట్లు శుభ్రం చేసిన పవన్...వాళ్లిద్దరికీ స్ట్రాంగ్ వార్నింగ్

Highlights

Pawan Kalyan visits Kanakadurga temple in Vijayawada: ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ దేవాలయంలో శుద్ది కార్యక్రమం నిర్వహించారు.

Pawan Kalyan visits Kanakadurga temple : తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీక్షలో భాగంగా పవన్ కల్యాణ్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అధికారులు పవన్ కల్యాణ్ కు ఘన స్వాగతం పలికారు. తర్వాత ఆయన ఆలయ మెట్లను శుభ్రం చేశారు.

ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఆలయ పరిసరాల్లో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. మెట్లు కడిగిన తర్వాత మెట్లకు పసుపు రాసిన తర్వాత కుంకుమతో బొట్లు కూడా పెట్టారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీలే కేశినేని శివనాథ్, బాలశౌరి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 1వ తేదీన పవన్ తిరుమల వెళ్లి, అక్టోబర్ 2న అక్కడ దీక్షను విరమించనున్నట్లు తెలిపారు.

తిరుమల లడ్డూపై వ్యంగ్యంగా మాట్లాడిన పొన్నవోలు సుధాకర్రెడ్డి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని..వ్యంగ్యంగా మాట్లాడానికి ఇది సరైన విషయం కాదని తేల్చిచెప్పారు. తప్పు జరిగితే క్షమాపణలు చెప్పాలనే అనుసంధానం ఉండాలని కానీ అహంకారంతో మాట్లాడటం సరికాదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తాను ఏ మతంపై విమర్శలు చేయలేదని..తిరుమల లడ్డూ అపవిత్రం అయితే దానిపై స్పందిస్తే తప్పు ఏంటని ప్రశ్నించారు. దేవతా విగ్రహాలు ధ్వంసం అవుతున్నప్పుడు తాను ఎలా సైలెంట్ గా ఉంటాను అని ప్రశ్నించారు.

సనాతన ధర్మంపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయకూడదని,ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యంగా మాట్లాడితే తాను ఊరుకోబోనని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు తప్పు చేసి రివర్స్ లో మాట్లాడుతున్నారని..మౌనంగా ఉండకూడదనే భావంతో అహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హిందూ ధర్మాన్ని పాటిస్తున్నట్లు చూపిస్తూప..హిందువులను అవమానిస్తున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూలరిజం అంటే రెండు వైపులా సమానంగా చూడాలని..సినీనటుడు ప్రకాశ్ రాజ్ కు ఈ విషయంతో ఏం సంబంధమని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories