Pawan Kalyan Varahi Yatra: నేటి నుంచి పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్ర

Pawan Kalyan Third Installment Of Varahi Yatra From Today
x

Pawan Kalyan Varahi Yatra: నేటి నుంచి పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్ర

Highlights

Pawan Kalyan Varahi Yatra: సాయంత్రం 5 గంటలకు జగదాంబ జంక్షన్ వద్ద వారాహి వాహనంపై రోడ్ షో

Pawan Kalyan Varahi Yatra: విశాఖలో జనసేన మూడో విడత వారాహి విజయ యాత్ర ఇవాళ్టినుంచి ప్రారంభం కాబోతుంది.. అంతకు ముందే విశాఖ సాగర తీరం పొలిటికల్ హీట్ తో వేడెక్కుతుంది.. వైసిపి, జన సేన కౌంటర్ పాలిటిక్స్ హై ఓల్టేజ్ లో పీక్ స్టేజ్ కి వెళ్తున్నాయి. ఇంతకీ విశాఖ లో పవన్ వారాహి యాత్ర ఎలా ఉండబోతుంది. పవన్ టార్గెట్ చేయనున్న అంశాలు ఏంటి..

పవన్ కళ్యాణ్ ఈరోజు మధ్యాహ్నం వైజాగ్ చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు జగదాంబ జంక్షన్ వద్ద వారాహి వాహనం పై నుండి పవన్ ప్రసంగిస్తారు. ఈ నెల 19 వరకూ పవన్ ఉమ్మడి విశాఖ జిల్లాలోనే పర్యటిస్తారు. ఆగస్టు 15న మాత్రం మంగళగిరిలో జెండా వందనం చేస్తారు. మూడో విడత వారాహి యాత్రలో విశాఖ జిల్లాలోని అర్బన్ సమస్యలపై పవన్ దృష్టి పెట్టనున్నారు. ఈ పది రోజుల్లో జనవాణి, బహిరంగ సభలు, వారాహిపై నుండి ప్రసంగాలు ఉంటాయి.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రజా సమస్యలు, ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను టార్గెట్ చేయబోతున్నారు. పర్యావరణం ధ్వంసం చేస్తూ రుషికొండ అక్రమ తవ్వకాలు, స్టీల్ ప్లాంట్ సమస్య, గంగవరం పోర్టు కార్మికుల సమస్యలపై ఫీల్డ్ విజిట్ లు చేయబోతున్నారు. మరోవైపు సుజాత నగర్ లో వాలెంటర్ హత్య చేసిన బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనకాపల్లి విస్సన్నపేటలో భూ ఆక్రమణలకుసంబంధించి కూడా ఫీల్డ్ విజీట్ లు చేయబోతున్నారు. అయితే ఇప్పటికే నగరంలో పోలీసులు సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. అయినా వారాహి యాత్ర పూర్తి చేస్తామని జనసేన నేతలు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories