Pawan Kalyan: రాజకీయ పొత్తులపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan Sensational Comments On AP Politics
x

Pawan Kalyan: రాజకీయ పొత్తులపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Highlights

Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైన పవన్ వ్యాఖ్యలు

Pawan Kalyan: రాజకీయాల్లో స్పీడ్ పెంచి పవన్ కళ్యాణ్ తొలిసారిగా పొత్తులపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల పరామర్శించేందుకు వచ్చిన పవన్ ... తన రాజకీయ భవిష్యత్ ఫ్యూహామెంటో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఇంత కాలం పొత్తులు ఇతర కీలక అంశాలపై ఆచూ చూచి అడుగులు వేసిన పవన్ ... ఇప్పుడు నేరుగా పొత్తులపై మాట్లాడడం రాజకీయాల్లో కీలకంగా మారింది. బీజేపీతో దోస్తీ కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ ... టిడిపితో కలసి ఎన్నికల్లో అడుగులు వేస్తారా ?.లేదంటే బీజెపీతోనే కలసి పోటీ చేస్తారా ?...

ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని అడుగులు వేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పొత్తులు, ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో పార్టీ పనితీరును గుర్తుచేసుకుంటూ, జనసేన మొత్తం ఓట్లలో 7శాతం ఓట్లు సాధించి 137 స్థానాల్లో పోటీ చేసిందని కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ సుస్థిరతను కాపాడుకోవాల్సిన ప్రాముఖ్యతను ప్రస్తావించిన ఆయన తమ పార్టీ వ్యూహాత్మక పొత్తులను ఏర్పరచడానికి ఆసక్తిగా ఉందన్నారు. కూటమి ఏర్పాటును మొదట్లో వ్యతిరేకించే ఏ పార్టీనైనా ఒప్పించేందుకు తాను వ్యక్తిగతంగా కృషి చేస్తానని తెలిపారు. సీట్ల పంపకానికి సంబంధించిన ప్రమాణాలను వివరిస్తూ.. ఒక్కో పార్టీ బలం ఆధారంగా నిర్ణయిస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలు వస్తే జూన్‌లో క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పర్యటనలు ప్రధానంగా జనసేన పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటాయని వెల్లడించారు.

ముఖ్యమంత్రి పదవికి సంబంధించి, ఇది వ్యక్తిగత ఆశయం కంటే శ్రద్ధ, చిత్తశుద్ధితో కూడిన పని ఫలితమని కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం కష్టపడితే ముఖ్యమంత్రి పదవి సహజంగానే వస్తుందని, పదవిపై కాకుండా పనిపైనే దృష్టి పెడుతున్నానని చెప్పారు.ముఖ్యమంత్రి అభ్యర్థి డిమాండ్ పొత్తులకు ముందస్తు షరతు కాకూడదని, ఒక్కో పార్టీ బలంపైనే సీట్ల పంపకం ఆధారపడి ఉంటుందని తేల్చి చెప్పారు. తన రాజకీయ వైఖరిని అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా ఉండేవారే తనకు నిజమైన మద్దతుదారులని ప్రకటించారు.2019లో జనసేన పార్టీ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చిందన్న పవన్‌ కళ్యాణ్‌.. తాను సీఎం అభ్యర్థి అయితేనే పొత్తు పెట్టుకోవాలని కొంతమంది చెబుతున్నారని.. తెలిపారు. అప్పుడు కనీసం 40 సీట్లు ఇచ్చి ఉంటే ఇప్పుడు బలంగా ఉండేవాళ్లని అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో కుమారస్వామి 30 సీట్లతో ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు. జనసేనకు కూడా 30-40 సీట్లు ఇచ్చి ఉంటే ఏపీలో కూడా కర్ణాటక తరహాలో పరిస్థితి ఉండేదని చెప్పారు.వచ్చే ఎన్నికల్లో 40 సీట్లలో గెలిపించినా సీఎం పదవి డిమాండ్‌ చేస్తానని వెల్లడించారు. కష్టపడి పనిచేస్తే పదవి దానంతట అదే వస్తుందని తెలిపారు.అంతకు ముందు ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించారు. రైతులను ప్రభుత్వం పూర్తి స్దాయిలో ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

రైతుల పరామర్శ అయినా పొత్తులు,ఇతర రాజకీయ అంశాలపై పవన్ ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.అది కూడా పొత్తులు అంశంపై మాట్లాడుతూనే వచ్చె పార్టీలను పొత్తుకు ఒప్పిస్తామని చెప్పడం వచ్చె ఎన్నికల్లో పవన్ మిగిలిన రెండు పార్టీలతో కలసి వెళ్తారా అనే చర్చకు పవన్ కళ్యాణ్ తెరతీశారు.అదే గాని జరిగితే వచ్చె ఎన్నికల్లో పవన్ ప్రభావం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories