Pawan Kalyan: సీఎం జగన్‌పై విమర్శల డోసు పెంచిన జనసేనాని

Pawan Kalyan Increased The Dose Of Criticism On CM Jagan
x

Pawan Kalyan: సీఎం జగన్‌పై విమర్శల డోసు పెంచిన జనసేనాని

Highlights

Pawan Kalyan: ఏపీ పాలిటిక్స్‌లో హీట్ రేపుతున్న వారాహి యాత్ర

Pawan Kalyan: ఏపీ పాలిటిక్స్‌లో మళ్లీ వారాహి వార్ మొదలైంది. వైసీపీ, జనసేన మధ్య విమర్శల దాడి ముదురుతోంది. విశాఖ వేదికగా పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి. మొన్న వైసీపీని ఏపీలో లేకుండా చేస్తానంటూ కామెంట్ చేసిన జనసేనాని.. నిన్న మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్‌పై విమర్శల డోసు పెంచారు. అవినీతి, అక్రమాల వల్లే తెలంగాణ నుంచి తన్ని తరిమేశారంటూ జగన్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జగన్ కన్ను ఉత్తరాంధ్ర మీద పడిందని.. ఇక్కడితో వైసీపీ దోపిడీకి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.

అయితే వారాహి టూర్‌లో పవన్ చేస్తున్న కామెంట్లపై వైసీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. జెండా ఎజెండా లేని వ్యక్తి.. చంద్రబాబును సీఎం చేయడమే పనిగా పెట్టుకున్నారంటూ అధికార పార్టీ నేతలు ఆరోపించారు. నిన్న అమలాపురం సభలో సీఎం జగన్‌ టీడీపీ, జనసేనలపై విరుచుకుపడ్డారు. పవన్‌ కళ్యాణ్‌ తపన తాను సీఎం అవ్వాలని కాదు.. చంద్రబాబును సీఎం చేయడానికే అన్నారు. ఏనాడూ ప్రజలకు మంచి చేయాలని ఆలోచన లేని వాళ్లు ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరారంటూ వ్యాఖ్యలు చేశారు.

పవన్ వ్యాఖ్యలతో ఏపీ మంత్రులు విరుచుకుపడ్డారు. పవన్‌కు జెండా, ఎజెండా లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబును సీఎం చేయడానికే పవన్ తాపత్రయమంతా అంటూ మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్లు విసిరారు. పార్టీ పెట్టి ఇన్నాళ్లైనా ప్రజలకు ఏం చేస్తామో చెప్పలేని పరిస్థితిలో పవన్ ఉన్నారన్న మంత్రి అమర్నాథ్‌.. జగన్‌ను తిట్టినంత మాత్రాన నాయకులు అవ్వలేరని ఘాటుగానే స్పందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories