Pawan Kalyan: కారా మాస్టారు మృతిపట్ల పవన్ దిగ్భ్రాంతి

Pawan Kalyan on Ramarao Demise
x

Pawan Kalyan File Photo

Highlights

Pawan Kalyan: ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూశారు.

Pawan Kalyan: ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో ఉన్న ఆయన.. శ్రీకాకుళంలో తన నివాసంలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. కథా రచయిత కాళీపట్నం రామారావు(కారా మాస్టారు) మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌. కారా మాస్టారు పేరు చెప్పగానే ఆయన రాసిన 'యజ్ఞం' గుర్తుకొస్తుందని చెప్పారు. సమాజంలో అట్టడుగు వర్గాలవారి బతుకు చిత్రాన్ని, జీవన సమరాన్ని ఆక్షరాల్లో చూపించారని పవన్ గుర్తుచేశారు.

1924లో లావేరు మండలం మురపాకలో ఆయన జన్మించారు. కారా మాస్టారుగా ప్రసిద్ధి పొందిన ఆయన శ్రీకాకుళం నగరంలో కథా నిలయాన్ని స్థాపించారు. తన రచనలకు గాను పలు కేంద్ర, రాష్ట్ర అవార్డులు పొందారు. అనేక యూనివర్శిటీల నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు కథా సాహిత్యానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకొంటూ రచయితలు, కవులు, కళాకారుల నివాళులర్పించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదంటూ పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కథకు చిరునామాగా, 'కథానిలయం' పేరుతో భావి తరాల కోసం సాహితీ సంపదను కాపాడిన సాహితీ మూర్తి కారా మాస్టారు అంటూ కొనియాడారు.1924లో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాకలో కారా మాష్టారు జన్మించారు. శ్రీకాకుళంలో కథానిలయాన్ని స్థాపించారు. యజ్ఞం, తొమ్మిది కథలకు కేంద్ర సాహిత్య అవార్డు అందుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories