Saree Cake: పచ్చని రంగు పట్టు చీర, బంగారు ఆభరణాలతో కేక్..

Pattu Saree Cake Special Attraction in Engagement
x

Saree Cake: పచ్చని రంగు పట్టు చీర, బంగారు ఆభరణాలతో కేక్..

Highlights

Saree Cake: చీరలంటే మహిళలకు మక్కువ. అందులో అందమైన చీర కనిపిస్తే ఎప్పుడు కట్టుకుందామని అనుకుంటారు.

Saree Cake: చీరలంటే మహిళలకు మక్కువ. అందులో అందమైన చీర కనిపిస్తే ఎప్పుడు కట్టుకుందామని అనుకుంటారు. అయితే ఓ వేడుకలో కనిపించిన చీర అందరినీ ఆకట్టుకుంటున్నా... దీన్ని మాత్రం కట్టుకోలేరు. ముక్కలుముక్కలుగా కట్ చేసి తినాల్సిందే. ఇదేంటని ఆలోచిస్తున్నారా... ? పట్టుచీర కేక్ ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వార్త. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

పెట్టుబోతలకు పెట్టింది పేరు ఏపీలోని కోనసీమ. అందులో ఆడపడుచులకు చీరసారెలు, అల్లుళ్లకు ఆతిధ్యం ఇవ్వడంలో ఓ ప్రత్యేకను సంతరించుకుంది. మొన్నటికి మొన్న కొత్త అల్లుడుకి టన్నుల కొద్దీ చేపలు, పీతలు ఇచ్చి ఆశ్చర్యం కలిగించిన కోనసీమ వాసులు ఇప్పుడు మరో అద్భుతంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. అమలాపురంలో జరిగిన నిశ్చితార్థ మహోత్సవానికి తీసుకెళ్ళే స్వీట్స్ ను ప్రత్యేకంగా తయారు చేయించి అందరినీ ఆకర్షించారు.

వివాహ నిశ్చితార్థ వేడుక కోసం తీసుకెళ్ళే స్వీట్స్ లో ఒక అందమైన పట్టు చీర ఆకృతిలో కేకును తయారు చేయించారు. ఎరుపు రంగు అంచు, పచ్చని పట్టు చీరలా కేక్ ను తయారు చేసి దాని మీద బంగారు నగలు, గాజులు వంటి వస్తువుల రూపంలో డిజైన్ వేయించారు. ఆ వేడుక మొత్తంలో ఈ కేక్ ప్రత్యేకంగా నిలువగా అది చూసిన అతిధులందరూ ఆశ్చర్యానికి గురైయ్యారు. బాగుంది కదండీ పట్టుచీర కేక్. ఏదేమైనా కాబోయే కోడలికి ఓ సర్ ప్రైజ్ ఇచ్చి సంతోషపరిచిన ఆ కుటుంబ ఆలోచనను అందరూ భేష్ అనాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories