Ongole: రిమ్స్‌లో దారుణం.. నర్సుపై లైంగిక దాడికి పాల్పడ్డ కోవిడ్‌ బాధితురాలి బంధువు

Patients Relative Assaults Nurse at ongole RIMS Hospital
x

Ongole: రిమ్స్‌లో దారుణం.. నర్సుపై లైంగిక దాడికి పాల్పడ్డ కోవిడ్‌ బాధితురాలి బంధువు

Highlights

Ongole: ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్‌లో దారుణం జరిగింది.

Ongole: ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్‌లో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే నర్సుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు కోవిడ్‌ బాధితురాలి బంధువు. వార్డులోనే నర్సుతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అటు నిందితుడుని అడ్డుకున్న వార్డులోని రోగులు, వారి బంధువులు నర్సును కాపాడారు. ఈ దృశ్యాలు ఆసుపత్రిలోని సీసీ కెమరాల్లో రికార్డయ్యాయి. బాధితురాలి నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్న పోలీసులు నిందితుడు విజయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో వెంటనే కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories