Parliament Monsoon Session: వైసీపీ ఎంపీల ఆందోళనతో దద్దరిల్లిన రాజ్యసభ

Parliament Monsoon Session: YCP MPs Protest in Rajya Sabha
x

Parliament Monsoon Session: వైసీపీ ఎంపీల ఆందోళనతో దద్దరిల్లిన రాజ్యసభ

Highlights

Parliament Monsoon Session: రాజ్యసభలో వైసీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు.

Parliament Monsoon Session: రాజ్యసభలో వైసీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఏపీ ప్రత్యేక హోదా హామీపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. రూల్‌ 267 కింద నోటీసులిచ్చిన వైసీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చారు. ఒకపక్క కోవిడ్‌పై చర్చ జరుగుతుండగా నినాదాలతో హోరెత్తించారు. వైసీపీ ఎంపీల నిరసనల మధ్యే కొద్దిసేపు సభ కొనసాగింది. అయితే, కోవిడ్‌పై చర్చకు సహకరించాలంటూ వైసీపీకి కేంద్ర మంత్రులు విజ్ఞప్తి చేసినా వినకపోవడంతో మరోసారి రాజ్యసభ వాయిదా పడింది.

ప్రత్యేక హోదా, పోలవరంపై చర్చించాలంటూ నిన్న పార్లమెంట్‌లో ఆందోళనకు దిగిన వైసీపీ ఎంపీలు ఈరోజు కూడా ఉభయ సభల్లో నిరసనలకు దిగారు. రూల్‌ 267 కింద రాజ్యసభలో విజయసాయిరెడ్డి నోటీస్ ఇవ్వగా లోక్‌సభలో వాయిదా తీర్మానానికి నోటీస్ ఇచ్చారు ఎంపీ మార్గాని భరత్‌. ఏడేళ్లయినా ప్రత్యేక హోదా హామీ నెరవేర్చడం లేదన్న విజయసాయి సభా కార్యక్రమాలన్నింటినీ సస్పెండ్ చేసి తక్షణమే చర్చించి నిర్ణయం తీసుకోవాలని రాజ్యసభ ఛైర్మన్‌‌ను కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories