Padmavathi Express: పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌.. ఆలస్యంగా బయల్దేరనున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌

Padmavathi Express Derail At Tirupati Railway Station
x

Padmavathi Express: పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌.. ఆలస్యంగా బయల్దేరనున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ 

Highlights

Padmavathi Express: బోగీ పట్టాలు తప్పడంతో ఆలస్యంగా బయల్దేరనున్న రైళ్లు

Padmavathi Express: తిరుపతి రైల్వేస్టేషన్ లో పద్మావతి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. యార్డ్‌లో షంటింగ్ చేస్తుండగా పద్మావతి ఎక్స్ ప్రెస్ బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వేసిబ్బంది మరమ్మతులు చేపట్టారు. అయితే పద్మావతి ఎక్స్ ప్రెస్ తో పాటు పలు రైళ్ల టైమింగ్స్ ను రీ షెడ్యూల్ చేసింది రైల్వే డిపార్ట్ మెంట్. తిరుపతి నుంచి సాయత్రం 4 గంటల 55 నిమిషాలకు బయల్దేరాల్సిన పద్మావతి ఎక్స్ ప్రెస్ రాత్రి 7 గంటల 45 నిమిషాలకు రీ షెడ్యూల్ చేశారు. అలాగే.. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు తిరుపతి నుంచి బయలుదేరాల్సిన రాయలసీమ ఎక్స్ ప్రెస్ రాత్రి 8 గంటలకు బయలుదేరుతుందని రైల్వే అధికారులు ప్రకటించారు..

Show Full Article
Print Article
Next Story
More Stories