OutSourcing Employees Salaries in AP: ఒకటినే ఔట్ సోర్సింగ్ జీతాలు.. మాట నిలబెట్టుకున్న సీఎం

OutSourcing Employees Salaries in AP: ఒకటినే ఔట్ సోర్సింగ్ జీతాలు.. మాట నిలబెట్టుకున్న సీఎం
x
OutSourcing Staff
Highlights

OutSourcing Employees Salaries in AP: ఇక నుంచి ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రతి నెల 1నే వేతనాలను అందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది.

OutSourcing Employees Salaries in AP: ఇక నుంచి ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రతి నెల 1నే వేతనాలను అందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. గతంలో మాదిరి కాకుండా ఇచ్చిన మాట మేరకు దళారీ ఏజెన్సీలకు స్వస్తి పలికి నేరుగా కొత్తగా ఏర్పాటు చేసిన కార్పోరేషన్ పరిధిలోకి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీసుకొచ్చి నేరుగా నియామాకాలను సైతం చేపట్టేందుకు ఏపీప్రభుత్వం ముందుకు వచ్చింది.

రాష్ట్రంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మంచి రోజులు వచ్చాయి. వచ్చే నెల 1నే వారికి జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రతి నెలా ఒకటినే వారికి జీతాలు ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల డేటా సక్రమంగా ఉందా, లేదా అనే విషయాన్ని పరిశీలించాల్సిందిగా ట్రెజరీ అధికారులను శనివారం ప్రభుత్వం ఆదేశించింది.

► ఇచ్చిన మాట మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నెల 3న ప్రత్యేకంగా ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

► ఈ నెల 3 నాటికి 50 వేలకు పైగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు కార్పొరేషన్‌ పరిధిలోకి వచ్చారు.

► కార్పొరేషన్‌ పరిధిలోని ఉద్యోగులకు వచ్చే నెల 1 నుంచి సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ ద్వారా వేతనాలను చెల్లించనున్నారు. సచివాలయ శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాలకు సంబంధించి కార్పొరేషన్‌ సమర్పించిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల డేటాను పే అండ్‌ అకౌంట్‌ ఆఫీసర్లు పరిశీలించాల్సిందిగా ట్రెజరీ, అకౌంట్స్‌ డైరెక్టర్‌ ఆదేశించారు.

► జిల్లా కార్యాలయాలు, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూషన్స్‌కు చెందిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల డేటాను జిల్లా ట్రెజరీ అధికారులు పరిశీలించాల్సిందిగా ఆదేశాలిచ్చారు.

► ఆయా పోస్టులకు విద్యార్హతలతోపాటు కుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాలన్నారు. ఆర్థిక శాఖ అనుమతితోనే ఉద్యోగులను తీసుకున్నారా, లేదా, మంజూరైన పోస్టుల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారా, లేదా చూడాలని సూచించారు.

► డేటాను పూర్తిగా పరిశీలించి జిల్లా ట్రెజరీల డిప్యూటీ డైరెక్టర్లు నివేదికను వచ్చే నెల 9లోగా ఆన్‌లైన్‌లో పంపించాలన్నారు.

ఇక నియామకాలు కార్పొరేషన్‌ ద్వారానే..

► ఇక ప్రభుత్వ రంగంలో ఏ శాఖ లేదా సంస్థకైనా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు అవసరమైతే ఈ కార్పొరేషన్‌ ద్వారానే తీసుకోనున్నారు. దీని వల్ల ఏజెన్సీలు, దళారీ వ్యవస్థకు ఆస్కారం ఉండదు.

► గతంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు కావాలంటే అభ్యర్థులు లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. అలాగే జీతాలకు ఆ ఏజెన్సీలకు ప్రభుత్వం నగదు ఇచ్చేది. ఏజెన్సీలు ఉద్యోగులకు జీతం పూర్తిగా ఇవ్వకుండా

మిగుల్చుకునేవి.

► ఇప్పుడు ఉద్యోగాలకు, జీతాలకు పైసా లంచం లేకుండా పూర్తి పారదర్శకంగా కార్పొరేషన్‌ నిర్వహించనుంది.

► వివక్షకు తావులేకుండా 50 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇవ్వడంతోపాటు, వాటన్నింటిలో 50 శాతం మహిళలకు ఇవ్వనున్నారు.

► అలాగే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ను కార్పొరేషన్‌ సక్రమంగా నిర్వహించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories