Loan Apps: ఆన్‎లైన్ రుణ యాప్స్‎కు అతలాకుతలం అవుతున్న ఫ్యామిలీలు

Online Loan Apps Harassment
x

Loan Apps: ఆన్‎లైన్ రుణ యాప్స్‎కు అతలాకుతలం అవుతున్న ఫ్యామిలీలు

Highlights

Loan Apps: పేదలు, మధ్యతరగతి ప్రజలే టార్గెట్‎గా లోన్ యాప్స్ గాలాలు

Loan Apps: ఆన్‎లైన్ అప్పులు అమాయకుల ప్రాణాలు తోడేస్తున్నాయి. స్థానికంగా అప్పు పుట్టకనో.. అత్యవసరాలు తీరే మార్గం లేకనో.. సులభంగా డబ్బు దొరుకుతుందన్న ఆశతో.. నిండుజీవితాలను పణంగా పెడుతున్నారు. చిన్న వయసులోనే భార్యాబిడ్డలను ఏకాకుల్ని చేసి.. అనంత లోకాలకు పయనమవుతున్నారు. అభంశుభం తెలియని పసిపాపలు.. ఎవరేమిటో తెలియని వయసులోనే అనాథలుగా మిగిలిపోతున్నారు. తండ్రి లేని పిల్లల్ని ఎలా పెద్దచేయాలో తల్లులకు ప్రశ్నార్థకంగా మారుతుండగా.. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లల కారణంగా.. వృద్ధురాళ్లయిన బామ్మల మీద వారి పోషణా బాధ్యతలు పడుతున్నాయి.

ఎక్కడున్నారో, ఎలా ఉంటారో తెలియని తెరచాటు డిజిటల్ మనుషులు.. అనేక పేద కుటుంబాల్లో మాటలకందని విలయాన్ని సృష్టిస్తున్నారు. అందుకు ఈ దృశ్యాలే సాక్ష్యం.

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మామిడిపల్లికి చెందిన నిరుపేద యువకుడైన 35 ఏళ్ల బొమ్మిడి రాజేంద్రప్రసాద్ కుటుంబం దీనావస్థ ఇది. కాస్తో కూస్తో చదువుకున్న రాజేంద్రప్రసాద్.. ఓ ప్రైవేట్ సంస్థలో మార్కెటింగ్ విభాగంలో చిరుద్యోగం చేసుకుంటున్నాడు. అయితే కుటుంబ అవసరాల కోసం రాజేంద్రప్రసాద్ లోన్ యాప్ ను ఆశ్రయించాల్సి వచ్చింది. అందులో 50 వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. వాయిదాలు చెల్లించేందుకు సర్దుబాట్లు చేసుకుంటున్న క్రమంలోనే.. లోన్ యాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. అప్పు తీసుకున్న నెల రోజులకే.. మూడింతలు తిరిగి చెల్లించాలంటూ వేధింపులు మొదలయ్యాయి. 50 వేల అప్పుకు వడ్డీతో కలిపి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న రాజేంద్రప్రసాద్ కు.. నెల తిరక్కుండానే 2 లక్షలు కట్టాలంటూ ఫోన్ లో వేధింపులు ఎదురయ్యాయి. దీంతో ఆ 2 లక్షలు తీర్చడం ఇక తన వల్ల అసంభవం అనుకున్నాడు రాజేంద్రప్రసాద్. 2 లక్షలు కట్టకపోతే తన పరువు, భార్యపరువు, కుటుంబం పరువు బజారున పడటం ఖాయంగా కనిపించింది. అనేక మొబైల్ నెంబర్ల నుంచి ఫోన్ల మీద ఫోన్లు రావడాన్ని ఊహించలేకపోయాడు. కళ్లకు కనిపించని లెక్కలేనంత మంది అదృశ్య మానవులు.. హిందీలో బండబూతులు తిడుతూ డబ్బులు కట్టమంటూ వేపుకు తిన్నారు. కట్టకపోతే ఎదురయ్యే పరిస్థితి ఏంటో కూడా వారి మాటల్లో క్లియర్ గా కనిపిస్తోంది. దీంతో భార్యా బిడ్డల్ని వదిలేసి.. శాశ్వతంగా సెలవు తీసుకున్నాడు. ఇప్పుడీ పిల్లలకు తండ్రి లేడు. పిల్లల బాధ్యత ఎలా మోయాలో తెలియక.. ఆ తల్లి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఇక గుండె చెదిరే ఈ దృశ్యాలు.. ఆంద్రాలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందినవి. ఈ చిన్నారులకు కూడా తల్లిదండ్రుల్ని శాశ్వతంగా దూరం చేసింది పాపిష్టి లోన్ యాప్ నిర్వాహకులే. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం లబ్బర్తికి చెందిన కొల్లి దుర్గాప్రసాద్‌, రమ్యలక్ష్మి దంపతులు కొన్నేళ్లుగా రాజమండ్రిలోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్నారు. వారికి నాలుగేళ్లు, రెండేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అవసరం కోసం లోన్‌ యాప్‌ ద్వారా 50 వేలు తీసుకున్నారు. సకాలంలో చెల్లించకపోవడం, వడ్డీకి వడ్డీ కలిసి చక్రవడ్డీగా మారి మోయలేని విధంగా పెరిగిపోయింది. అటు యాప్ నిర్వాహకుల టార్చర్ మొదలైంది. వారు పెట్టే చిత్రవధ ఎలా ఉంటుందో తెలిస్తే.. బహుశా ఈ అప్పే చేయకపోదురేమో. కానీ.. వారు ఎదుర్కొంటున్న పరిస్థితి నుంచి బయటపడాలంటే.. సులభంగా, తక్కువ టైమ్ లో దొరికే రుణమే పరిష్కార మార్గంగా తోచింది. లోన్ యాప్ ద్వారా 50 వేలు తీసుకొని.. వారి వేధింపులు భరించలేక.. అప్పు తీర్చే టైమ్ కూడా దొరక్క.. చావొక్కటే శరణ్యమని భావించారు. రాజమండ్రిలోని ఓ లాడ్జిలో కూడబలుక్కొని ఆత్మహత్య చేసుకున్నారు. కన్నబిడ్డలను శాశ్వతంగా ఒంటరివాళ్లను చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories