ఏపీలో ఇకనుంచి ఆన్‌లైన్ రమ్మీ ఆడారో.. జైలుశిక్షే..

ఏపీలో ఇకనుంచి ఆన్‌లైన్ రమ్మీ ఆడారో.. జైలుశిక్షే..
x
Highlights

యువతను తప్పుడు మార్గంలో నెట్టివేస్తున్న రమ్మీ, పేకాట వంటి ఆన్‌లైన్ ఆటలను నిషేధించాలని..

యువతను తప్పుడు మార్గంలో నెట్టివేస్తున్న రమ్మీ, పేకాట వంటి ఆన్‌లైన్ ఆటలను నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఆన్‌లైన్ జూదం నిషేధించే నిర్ణయం తీసుకున్నట్లు సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య (నాని) తెలిపారు. కేబినెట్ సమావేశం ముగింపులో విలేకరులకు వివరించిన మంత్రి, ఆన్‌లైన్ జూదం యువతను 'తప్పుదోవ పట్టించడం' ద్వారా వారి కెరీర్ ను దెబ్బతీసే విధంగా మారిందని అన్నారు. కాబట్టి యువతను రక్షించడానికి ఇలాంటి ఆన్‌లైన్ జూదాలను నిషేధించాలని మేము నిర్ణయించుకున్నాము అని నాని చెప్పారు. కేబినెట్ నిర్ణయం ప్రకారం, ఆన్‌లైన్ జూదం నిర్వాహకులకు జరిమానా విధించడంతో పాటు, మొదటిసారి చేసిన నేరానికి ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవిస్తారు.

రెండవసారి నేరం చేస్తే జరిమానా తోపాటు జైలు శిక్ష రెండేళ్ల వరకు ఉంటుంది. ఇదే కాక మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది క్యాబినెట్.. అందులో ముఖ్యంగా.. ఉచిత విద్యుత్‌ పథకం నగదు బదిలీకి కూడా కేబినెట్‌ ఆమోదం లభించింది. అలాగే చేసిన గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలో డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్స్‌ పోస్టులు ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌డీసీ) ఏర్పాటు చేస్తూ జీవో ఎంఎస్‌ నెంబర్‌ 80 ని కూడా ఆమోదించింది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన 41.97 ఎకరాల భూమిని కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories