గుంటూరు జిల్లా వెలగపూడిలో కొనసాగుతోన్న ఉద్రిక్తత

గుంటూరు జిల్లా వెలగపూడిలో కొనసాగుతోన్న ఉద్రిక్తత
x
Highlights

* మృతదేహంతో రోడ్డుపైనే బైఠాయించిన బాధితులు * న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించమంటోన్న బాధితులు * ఎంపీ నందిగం సురేష్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్‌

గుంటూరు జిల్లా వెలగపూడిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరియమ్మ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించిన బాధితులు... ఎంపీ నందిగం సురేష్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మంత్రులు.. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నాలు చేసినా.. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటున్నారు బాధితులు.

ఎంపీ సురేష్‌‌ను A1 ముద్దాయిగా చేర్చాలని డిమాండ్ చేస్తోన్న బాధితులు.. లేదంటే మరియమ్మ డెడ్‌బాడీతో సీఎం క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. 29మందిపై తాము ఫిర్యాదుచేస్తే.... ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ కాపీ ఇవ్వలేదని బాధిత కుటుంబం మండిపడుతోంది. కనీసం ఎఫ్‌ఐఆర్ కాపీ లకూడా ఇవ్వలేని స్థితిలో పోలీసులు ఉన్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎఫ్‌ఐఆర్ కాపీ ఇవ్వకపోతే నేరుగా సీఎం క్యాంప్ ఆఫీస్‌‌కు వెళ్తామని హెచ్చరిస్తున్నారు.

మరియమ్మ డెడ్ బాడీ వెలగపూడి చేరుకుంది. మృదేహంతో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళ చేస్తున్నారు. ఎంపీ నందిగం సురేష్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఏ వన్‌ ముద్దాయిగా చేర్చాలని ఆందోళన చేస్తున్నారు. సాయం కాదు న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు. మరియమ్మ మృతిపై డీఎస్పీ జగన్నాథం శ్రీనివాసరావుకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో 29 మంది పేర్లు మెన్షన్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories