జీవో 3పై కొనసాగుతున్న వివాదం.. నేడు, రేపు మన్యం బంద్

జీవో 3పై కొనసాగుతున్న వివాదం.. నేడు, రేపు మన్యం బంద్
x
Highlights

జీవో -3పై వివాదం కొనసాగుతోంది. దీనిని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వాలు రివ్యూ పిటిషిన్ వేయాలనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.

జీవో -3పై వివాదం కొనసాగుతోంది. దీనిని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వాలు రివ్యూ పిటిషిన్ వేయాలనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బుధ, గురు వారాలు మన్యం అంతా బంద్ కు అన్ని ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి.

షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు శత శాతం స్థానిక గిరిజనులకు చెందేలా గతంలో ప్రభుత్వం జారీచేసిన జీవో-3ను సుప్రీంకోర్టు రద్దు చేయడాన్ని నిరసిస్తూ మంగళ, బుధవారాల్లో '48 గంటల బంద్‌'కు ఆదివాసీ హక్కులు, చట్టాల పరిరక్షణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (ఆదివాసీ జేఏసీ) పిలుపునిచ్చింది. మన్యం బంద్‌కు విపక్షాలు, ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయడానికి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చెండా ఏలియా, కార్యదర్శి సున్నం వెంకటరమణ గత మూడు రోజులుగా ఏజెన్సీలో పర్యటిస్తున్నారు.

విపక్షాలు, ప్రజా సంఘాలు మద్దతు...

ఆదివాసీ జేఏసీ చేపడుతున్న 48 గంట బంద్‌కు మద్దతు తెలుపుతున్నట్టు జీవో-3 సాధన సమితి రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు పి.అప్సలనర్స, కార్యదర్శి కాంతారావు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, గిరిజన సంఘం నేతలు కిల్లో సురేంద్ర, పాలికి లక్కు, జనసేన పార్టీ అరకులోయ పార్లమెంట్‌ ఇన్‌చార్జి వంపూరు గంగులయ్య, బీజేపీ అరకు జిల్లా అధ్యక్షుడు కురుసా ఉమామహేశ్వరరావు, గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి కూడా కృష్ణారావు, అరకు అసెంబ్లీ ఇన్‌చార్జి పాంగి రాజారావు తదితరులు ప్రకటించారు.

ఆదివాసీ జేఏసీ డిమాండ్లలో కొన్ని...

- జీవో-3ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలి. దీనిపై తీర్పు వెలువడేంత వరకు ఉద్యోగాల విషయంలో గిరిజనులు నష్టపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తక్షణమే ఆర్డినెన్సు తీసుకురావాలి.

- జీవో-3లో కల్పించిన ప్రయోజనాలను చట్టబద్ధం చేయడానికి గిరిజన సలహా మండలి (టీఏసీ)లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలి.

- 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి, మన్యంలోకి గిరిజనేతరుల అక్రమ వలసలను నిరోధించాలి.

- షెడ్యూల్‌ ఏరియాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలన్నింటినీ ఆదివాసులతోనే భర్తీ చేసేలా చట్టం తయారు చేసి, పార్లమెంట్‌లో ఆమోదించాలి.

- ఆదివాసీ విశ్వవిద్యాలయాన్ని షెడ్యూల్‌ ప్రాంతంలోనే నెలకొల్పాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories