Home Quarantine for 60 years people: 60 ఏండ్లు పైబ‌డితే .. హోం క్వారంటైన్..! జ‌గ‌న్ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం

Home Quarantine for 60 years people: 60 ఏండ్లు పైబ‌డితే .. హోం క్వారంటైన్..! జ‌గ‌న్ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం
x
one month home quarantine for 60 years people in andhra pradesh
Highlights

Home Quarantine for 60 years people: దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విభృంభిస్తుంది. రోజురోజుకూ క‌రోనా బారిన ప‌డిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జగ‌న్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

Home Quarantine for 60 years people: దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విభృంభిస్తుంది. రోజురోజుకూ క‌రోనా బారిన ప‌డిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జగ‌న్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏండ్లుకు పైబ‌డిన వారు, మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్, హెచ్ఐవీ బాధితులు, ధీర్ఘకాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారు ఇంటి నుంచి బయటికి రావద్దని స‌ర్కా ర్ సూచించింది. అలాంటి వారు మరో నెల రోజుల పాటు హోం క్వారంటైన్‌లోనే ఉండాలని స్పష్టం చేసింది. వీరికే వైరస్ సోకితే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్న‌ది. వీరంతా అధిక ప్ర‌మాదం హైరిస్క్ కేటగిరీలో ఉన్నారనీ,కుటుంబ స‌భ్యులు వీరిని జాగ్రత్తగా చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. కాగా, డాక్ట‌ర్ల స‌ల‌హాలు, సూచ‌న‌లు లేకుండా... హైడ్రాక్సీక్లోరోక్విన్‌ టాబ్లెట్స్ వాడకూడ‌ద‌ని ప్రభుత్వం హెచ్చ‌రింది.

ఏపీలో బుధ‌వారం వ‌ర‌కు క‌రోనా కేసులు ఆరువేలు దాటాయి. బుధ‌వారం వ‌ర‌కు మొత్తం 49,553 టెస్టులు చేశారు. దాంతో 6,045 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. అయితే భారీ ఊరట కలిగించే విషయం ఏమిటంటే.. కొత్తగా 6,494మంది కోవిడ్‌ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. డిశ్చార్జ్ కు ఏ రోజూ 15 వందలు దాటలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories