ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల
x


ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల


Highlights

ఆంధ్రప్రదేశ్‌ లో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన...

ఆంధ్రప్రదేశ్‌ లో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ శనివారం ఉదయం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికల నిర్వహణ కమిషన్ విధి అని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. సుప్రీం తీర్పును తక్షణం పాటిస్తామని తెలిపారు. హైకోర్టు తీర్పు సహేతుకమే అని... ఎస్ఈసీ వాదనను హైకోర్టు విశ్వసించిందని తెలిపారు. ఎస్ఈసీకి న్యాయవ్యవస్థపై విశ్వాసం, విధేయత ఉంటాయని చెప్పారు. కరోనా వ్యాక్సినేషన్ చేపడుతూనే విజయనగరం, ప్రకాశం మినహా మిగిలిన జిల్లాల్లో తొలి విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పొలింగ్ సమయాన్ని సాయంత్రం నాలుగు గంటల వరకు పొడిగించామన్నారు. సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని... సీఎస్, డీజీపీలు సహా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు వీడియో కాన్ఫరెన్సులో పాల్గొనాలని నిమ్మగడ్డ కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories