New Districts in AP: ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్

Notification of Formation of New Districts in Andhra Pradesh | AP  News Today
x

 ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్

Highlights

New Districts in AP: 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్

New Districts in AP: ఏపీలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ జగన్ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. యొత్తం 26 జిల్లాల రెవెన్యూ సరిహద్దులు, జిల్లా కేంద్రాలను నిర్దేశిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది. ప్రస్తుతం జిల్లా కేంద్రాలతో ఏర్పాటైన జిల్లాలకు పాత పేర్లనే ప్రకటించింది. ఇక.. కొత్త జిల్లాల్లో మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీసత్యసాయి, కాకినాడ, అన్నమయ్య, శ్రీబాలాజీ, పార్వతీపురం ఉన్నాయి.

మరోవైపు పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లా, పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి కేంద్రంగా అనకాపల్లి జిల్లా, కాకినాడ కేంద్రంగా కాకినాడ జిల్లా, అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా, ఏలూరు కేంద్రంగా ఏలూరు జిల్లా, విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల కేంద్రంగా బాపట్ల జిల్లా, నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా, నంద్యాల కేంద్రంగా నంద్యాల జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా, రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, తిరుపతి కేంద్రంగా శ్రీబాలాజీ జిల్లా ఉండగా.. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు జిల్లా కేంద్రాలు మార్పు చేసింది. రాజమండ్రి కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లా, భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లాను ప్రకటించింది.

ఇక కొత్త జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్లపై స్థానికుల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనుంది. 30 రోజుల్లో అభ్యంతరాలు, సలహాలు తెలియజేయాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. మరోవైపు.. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో రెవెన్యూ డివిజన్లు పెరిగాయి. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో 50 రెవెన్యూ డివిజన్లు ఉండగా వైసీపీ ప్రభుత్వం కొత్తగా మరో 13 ప్రతిపాదించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories