వరద గోదారితో లంక గ్రామాలకు తప్పనిసరి తిప్పలు !

వరద గోదారితో లంక గ్రామాలకు తప్పనిసరి తిప్పలు !
x
Highlights

Normal life disrupted in Lanka villages amid Godavari floods: గోదావరికి పోటెత్తిన వరదలతో కోనసీమ లంక గ్రామాలు అతలాకుతలమయ్యాయి. 60కి పైగా లంక గ్రామాలు...

Normal life disrupted in Lanka villages amid Godavari floods: గోదావరికి పోటెత్తిన వరదలతో కోనసీమ లంక గ్రామాలు అతలాకుతలమయ్యాయి. 60కి పైగా లంక గ్రామాలు గోదారమ్మ ఉగ్రరూపానికి జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. రెక్కాడితే కాని డొక్కాడని జీవితాలే ఎక్కువగా లంక గ్రామాల ప్రజలివి. వరద ముంచెత్తడంతో పంటలన్నీ నాశనమయ్యాయి. రైతులు దిక్కుతోచని స్థితిలోపడ్డారు. కోనసీమలో వరద రైతుల కష్టాలుపై ప్రత్యేక కధనం చూద్దాం.

మాయదారి వరదొచ్చిదంటే లంకగ్రామాల ప్రజలకు కష్టాలు తప్పవు. ప్రతి ఏటా భారీగా వరదలు రాకపోయినా, ఆరేళ్ళకో, పదేళ్లుకో ఓసారి భారీగా వచ్చే వరదలకు కోనసీమ లంకవాసులు అతలాకుతలమవుతుంటారు. లంక గ్రామాల ప్రజలంతా కేవలం వ్యవసాయం, పాడి పరిశ్రమ మీదే ఆధారపడి జీవిస్తుంటారు. వరదొచ్చి రెండుమూడు రోజులలో పోతే ఫర్వాలేదు కానీ వారం రోజులు తిష్టవేస్తే ఇక అన్ని పంటలూ సర్వనాశనమే అవుతాయి. ఒక్కో ఏడాది గోదావరి ఉగ్రరూపం దాల్చి ఊళ్లను సయితం ముంచెత్తుతాయి. ప్రస్తుతం వరదలు కొబ్బరి తోటలకు మేలు చేస్తాయి కానీ మిగిలిన పంటలన్నింటికీ నష్టం కల్గించాయి. కౌలుకు భూములు తీసుకుని వరి, అరటి, కూరగాయ తోటలు, బొప్పాయి, పూలతోటలు, ఇలా అనేక పంటలు పండిచండంతోపాటు పాడిపశువులు ఎక్కువుగా పెంచుతుంటారు. పాడితోనే లంకవాసులలో చాలా కుటుంబాలు జీవనం సాగిస్తుంటాయి. అలాంటి జీవన విధానం పై ఈసారి గోదారమ్మ పిడుగు పడినట్టు విరుచుకుపడింది.

ఉగ్రరూపం దాల్చి త్వరగా తగ్గినట్టే తగ్గి తిరిగి పోటెత్తింది వరద. దీంతో పదిరోజుల వరకూ గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకుపోయాయి. పంటలు మునిగిపోయి కుళ్లిపోయాయి. పశువులకు దాణా లేక ఏటిగట్లపై దిగాలుగా పడివున్నాయి. గడ్డిలేకపోవడంతో పాలిచ్చే గేదెలు పాలివ్వడం తగ్గించేశాయి. ఇళ్లల్లో వున్నవారికి నిత్యావసరాలు అందక ఇక్కట్లు పడుతున్నారు. గ్రామాలకు గ్రామాలు నాలుగైదు అడుగులకు పైగానే జలదిగ్భందంలో చిక్కుకుపోయాయి. కనీసం అంత్యక్రియలు చేయడానికి కూడా ఆరు అడుగులు స్థలం దొరక్క లంకల్లోని వరద బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. లంక గ్రామాల ప్రజలను ప్రభుత్వం ఇంత వరకూ ఏ విధంగానూ ఆదుకోలేదని బాధిత రైతులు, ప్రజలు వాపోతున్నారు. కరెంట్ కూడా లేని ముంపు ఇళ్లల్లో విష సర్పాల భయంతో బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నారు. ఉన్న పాడిగేదెలను ఏటిగట్టుపై కట్టేసి వాటికి కాపలాగా రైతులు గట్లపై పడుకుంటున్న దుర్భర పరిస్థితులు ఏటిగట్లపై దర్శనమిస్తున్నాయి.

మరోవైపు కరోనా బాధితులూ వరదలలో ఇక్కట్లుకు గురవుతున్నారు. వారిని ఆస్పత్రికి చేర్చేవారు లేక అవస్థలు పడుతున్నారు. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని వాపోతున్నారు. వరదలు ముంచెత్తడంతో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. పరిహారాలు కౌలు రైతులకు కాకుండా పట్టాదారునికి చెల్లిస్తుంటే కౌలు రైతులు నష్టపోయే ప్రమదం వుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదలు తీసిన తర్వాత కూడా కొన్నాళ్లపాటు తిరిగి పంటలు వేయడానికి వుండదని, పొలాల్లో వేసిన మేటలు తొలగించుకోవడానికి కూడా వ్యయప్రయాసలు పడాల్సివస్తుందని రైతులు చెబుతున్నారు. పదివేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని ఉద్యానవన, వ్యవసాయశాఖ అంచనా వేస్తుంది. ఏది ఏమైనా కోనసీమ లంకప్రాంతాల్లోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలోని 29 మండలాల్లో వరద ప్రభావం పడింది. ఆలమూరు మండలం బడుగువానిలంకలో నష్టపోయిన పంటల తీరు చూస్తూంటేనే జరిగిన నష్ఠాన్ని అంచనా వేయవచ్చు. రైతులు బాధలు వర్ణాణా తీతంగా వున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories