తీవ్ర వాయుగుండంగా కొనసాగుతున్న నివర్ తుపాను

తీవ్ర వాయుగుండంగా కొనసాగుతున్న నివర్ తుపాను
x
Highlights

తీవ్ర వాయుగుండంగా నివర్ తుపాను కొనసాగుతోంది. రాగల 6 గంటల్లో వాయుగుండంగా. అనంతరం అల్పపీడనంగా బలహీన పడనుంది. తిరుపతికి పశ్చిమ నైరుతిగా 30 కిలోమీటర్ల...

తీవ్ర వాయుగుండంగా నివర్ తుపాను కొనసాగుతోంది. రాగల 6 గంటల్లో వాయుగుండంగా. అనంతరం అల్పపీడనంగా బలహీన పడనుంది. తిరుపతికి పశ్చిమ నైరుతిగా 30 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి పశ్చిమ వాయువ్య దిశగా 115 కిలోమీటర్ల దూరంలో నివర్ కేంద్రీకృతమై ఉంది. దీంతో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కోస్తాంధ్ర, కృష్ణా, గుంటూరులో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

మరోవైపు బంగాళాఖాతంలో ఈ వారంలో మరో రెండు తుపానులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని క్రమంగా బలపడి బురవి తుపానుగా మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది. డిసెంబరు 2న తమిళనాడులో బురవి తుపాను తీరం దాటుతుందని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ.

Show Full Article
Print Article
Next Story
More Stories