Night Landing Facility in Kadapa: కడపలో విమానాల నైట్ ల్యాండింగ్ కు అటవీశాఖ గ్రీన్ సిగ్నల్

Night Landing Facility in Kadapa: కడపలో విమానాల నైట్ ల్యాండింగ్ కు అటవీశాఖ గ్రీన్ సిగ్నల్
x
Highlights

Night Landing Facility in Kadapa: రాష్ట్రంలోని కొన్ని విమానాశ్రాయాల మాదిరిగానే కడపలో సైతం రాత్రి వేళల్లో విమానాలు దిగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Night Landing Facility in Kadapa: రాష్ట్రంలోని కొన్ని విమానాశ్రాయాల మాదిరిగానే కడపలో సైతం రాత్రి వేళల్లో విమానాలు దిగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి అవసరమైన లైట్లు ఏర్పాటుకు చేసే అటవీ ప్రాంతానికి కేంద్రం అనుమతులు ఇవ్వడంతో మార్గం సుగమం అయ్యింది. ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి స్వంత జిల్లా కడప కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది.

కడప విమానాశ్రయంలో రాత్రి వేళలో దిగే అవకాశం వస్తోంది. దీనికి సంబందించి అటవీశాఖ అనుమతులు ఇవ్వడానికి ఓకే చేసిందన్న సమాచారం వచ్చింది. కడప ఎమ్.పి అవినాశ్ రెడ్డి విజ్ఞప్తి మేరకు నేషనల్‌ వైల్డ్‌ లైఫ్‌ బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నారు. రాత్రి వేళలో విమానాలు దిగాలంటే పైలెట్లు గుర్తించడానికి కొండల పైభాగంలో అబ్‌స్టాకిల్‌ లైట్లు ఏర్పాటు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.ఇందుకు అటవీ శాఖ అనుమతులు అవసరమని తీర్మానించి కేంద్రానికి పంపారు.

ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా సర్వే బృందం సూచించిన నాలుగు ప్రాంతాల్లో ఈ అబ్‌స్టాకిల్‌ లైట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో రెండు ప్రాంతాలు కడప ఫారెస్ట్‌ డివిజన్‌లోని శ్రీ లంక మల్లేశ్వర అభయారణ్యంలో, మరో రెండు ప్రొద్దుటూరు ఫారెస్ట్‌ డివిజన్‌లోని నాగార్జున సాగర్‌– శ్రీశైలం పులుల సంరక్షణ ప్రాంతంలో ఉన్నాయి. ప్రస్తుతం వీటికి అనుమతిలిస్తూ నేషనల్‌ వైల్డ్‌ లైఫ్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories