New Welfare Schemes in Andhra Pradesh: ఏపీలో కొనసాగుతున్న పథకాల పరంపర

New Welfare Schemes in Andhra Pradesh: ఏపీలో కొనసాగుతున్న పథకాల పరంపర
x
New welfare schemes of andhra pradesh:
Highlights

New Welfare Schemes in Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టడంలో కానీ, వాటిని అమలు చేయడంలో కాని దేశంలోనే అగ్రగామిగా నిలిచింది.

New welfare schemes in Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టడంలో కానీ, వాటిని అమలు చేయడంలో కాని దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. లాక్ డౌన్ లో సైతం ఎన్ని ఇబ్బందులున్నా లెక్కచేయకుండా పథకాల అమలుకు పెద్ద పీట వేశారు. దీనిలో భాగంగానే గతంలో అమలు చేస్తున్న పథకానికి తన స్వంత పేరుతో నామ కరణం చేసి, దాన్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన చోట పథకం పటిష్టంగా అమలు చేసి పల్లెల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నారు.

సంక్షేమ పథకాల అమలులో ఏపీ సీఎం జగన్ దూసుకుపోతున్నారు. పంచాయతీరాజ్ ఎల్ ఈ డీ స్ట్రీట్ లైటింగ్ ప్రాజెక్ట్ పేరు మార్పులు చేసింది. ఈ ప్రాజెక్టుకు 'జగనన్న పల్లె వెలుగు పథకం'గా పేరును మార్పుచుతున్నట్లుగా పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ వెల్లడించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

జగనన్న పల్లె వెలుగు పథకం కింద రాష్ట్రంలోని 2 వేల ఆవాస గ్రామాల్లో 4 లక్షల ఎల్‌ఈడీ లైట్లను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం ఉన్న పథకాల్లో ఏ విధంగా కవర్‌ కానీ గ్రామాలను ఇందుకు ఎంపిక చేయనున్నారు. నూతనంగా ఫిర్యాదుల మానిటరింగ్‌ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు. వెలగని వీధి దీపాలను విలేజ్‌ సెక్రటరీలు ఎప్పటికప్పుడు ఈ సీఎంఎస్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులను అనుసరించి పరిష్కరిస్తారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories