AP New Liquor Policy : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త లిక్కర్ పాలసీ నేడే ప్రారంభం.. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు షాప్స్ ఓపెన్

AP New Liquor Policy : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త లిక్కర్ పాలసీ నేడే ప్రారంభం.. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు షాప్స్ ఓపెన్
x

New Liquor Policy: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త లిక్కర్ పాలసీ నేడే ప్రారంభం.. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు షాప్స్ ఓపెన్

Highlights

AP New Liquor Policy : ఏపీలో నూతన మద్యం పాలసీ అక్టోబర్ 16 నుంచి ప్రారంభమవుతోంది. కొత్త పాలసీ కింద బుధవారం ఉదయం 10 గంటలకు వైన్ షాపులు తెరుచుకుంటాయి. లిక్కర్ షాప్స్ టైమింగ్స్ ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అని ప్రభుత్వం ప్రకటించింది.

AP New Liquor Policy: ఏపీలో నూతన మద్యం పాలసీ అక్టోబర్ 16 నుంచి ప్రారంభమవుతోంది. కొత్త పాలసీ కింద బుధవారం ఉదయం 10 గంటలకు వైన్ షాపులు తెరుచుకుంటాయి. లిక్కర్ షాప్స్ టైమింగ్స్ ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అని ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల లిక్కర్ షాపుల లైసెన్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానించిన ప్రభుత్వం సోమవారం నాడు లాటరీ పద్ధతిలో తీసిన జాబితాను వెల్లడించింది.

ఏపీలో నూతన మద్యం పాలసీ అక్టోబర్ 16 నుంచి అమలులోకి వస్తుంది. తక్కువ ధరకే మద్యం విక్రయాలు జరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది. గత ఐదేళ్లుగా అందుబాటులో లేని డిజిటల్ పేమెంట్స్ ఇప్పుడు అందుబాటులోకి తెచ్చామని ప్రభుత్వం ప్రకటించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో డిజిటల్ పేమెంట్స్ పెరిగాయని తెలిపింది. దాంతో నగదు చెల్లింపు సమస్యకు చెక్ పెట్టింది కూటమి ప్రభుత్వం. నిబంధనలు కచ్చితంగా పాటించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని మద్యం షాపు నిర్వాహకులను ప్రభుత్వం హెచ్చరించింది.

మద్యం షాపుల కేటాయింపు సోమవారం జరిగింది. 3,396 షాపులకుగానూ 89,882 అప్లికేషన్లు రాగా, కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారులు లాటరీ తీసి మద్యం షాపుల విజేతల్ని అక్టోబర్ 14న ప్రకటించారు. మద్యం షాపులు దక్కించుకున్న వారికి బెదిరింపులతో పాటు కొన్నిచోట్ల మద్యం షాపుల విజేతలు కిడ్నాప్ అయ్యారని ప్రచారం జరిగింది.

ఏపీ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా నిర్వహించిన మద్యం షాపుల కేటాయింపుపై జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మద్యం షాపులను స్వేచ్ఛగా, ఎలాంటి భయాలు లేకుండా నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

కాగా, మద్యం విక్రయాలపై 2 శాతం సెస్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ శిస్తు రూపంలో వచ్చే ఆదాాయాన్ని ప్రభుత్వం నార్కోటిక్ నియంత్రణ చర్యలు, డీ-అడిక్షన్, పునారావాస కేంద్రాల ఏర్పాటుకు ఖర్చు చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories