APSRTC: ఏపీఎస్ ఆర్టీసీకి రానున్న కొత్త బస్సులు

New Buses Coming to APSRTC In Andhra Pradesh
x

APSRTC: ఏపీఎస్ ఆర్టీసీకి రానున్న కొత్త బస్సులు

Highlights

APSRTC: కాలం చెల్లిన బస్సులకు స్వస్తి పలకనున్న సంస్థ

APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ నూతన వరవడికి శ్రీకారం చుట్టబోతోంది. ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులకు స్వస్తి పలికి వాటి స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టబోతోంది. ఆర్టీసీలో ఉన్న బస్సులు కాలుష్యం వెదజల్లుతూ అటు ప్రయాణికులను ఇటు ఆర్టీసీని ఇబ్బందులు పెడుతున్నందున రాష్ట్రవ్యాప్తంగా కొత్త బస్సులు ప్రవేశపెట్టి మెరుగైన సేవలు అందించాలని ఆర్టీసీ భావిస్తోంది. ఇందులో భాగంగానే కొత్త బస్సులను ప్రవేశ పెట్టేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సిద్ధమవుతోంది.

ఏపీలో త్వరలో కొత్తగా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. రాష్ట్రంలో ప్రవేశపెట్టబోయే బస్సులను గ్రామీణ ప్రాంతాల్లో నడపనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఆర్టీసీ నడుపుతున్న పల్లెవెలుగు సర్వీసులు చాలావరకు కాలం చెల్లిపోయాయి. అందుకోసం వాటి స్థానంలో కొత్త వాటిని నడపాలని భావిస్తుంది ఆర్టీసీ త్వరలోనే ప్రైవేట్ సర్వీస్‌లను ఆర్టీసీ పరిధిలోకి తీసుకొని గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించే దిశగా అడుగులు వేస్తోంది ఆర్టీసీని గాడిలో పెట్టి ఆక్యుపెన్సీ రేటు పెంచేలా చర్యలు చేపట్టిన ఆర్టీసీ యాజమాన్యం అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తోంది. నష్టాలను నివారించడానికి కొత్త బస్సులను ప్రవేశపెట్టడం ప్రత్యామ్నాయమని భావిస్తున్న ఉన్నతాధికారులు ప్రైవేటు బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆర్టీసీలో ప్రైవేట్ సర్వీసులు పెంచడంపై ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆర్టీసీకి సొంత బస్సులు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ప్రైవేటు బస్సులను పెంచుకుంటూ పోవడంపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీలో రోజులు గడిచే కొద్దీ నియామకాలు నిలిచిపోవడం ప్రైవేట్ సర్వీసులు సంఖ్య పెరిగిపోవడంపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సొంత బస్సులను కొనుగోలు చేయకుండా ప్రైవేటు సర్వీసులను తీసుకుంటుండటం 900 అద్దె బస్సులు తీసుకున్న ఆర్టీసీ మరో వెయ్యి బస్సులను కొత్తగా తీసుకుంటే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న లక్షల మంది ఉద్యోగుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. కానీ ఉద్యోగులను ఎట్టిపరిస్థితుల్లోనూ తీసివేయబోమని చెబుతున్నారు ఎండీ ద్వారకా తిరుమలరావు మిగితా ఆయన మాటల్లోనే విందాం.

కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఆర్టీసీ 250 కోట్ల రూపాయలతో 617 బస్సులు కొనుగోలు చేయాలని భావించింది. ప్రభుత్వం ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించే ప్రయత్నంలో భాగంగా కొత్త బస్సులు కొనుగోలు చేయడం ఎంతో ముఖ్యం ఇప్పటికే ఆర్టీసీ కొనుగోలు చేయాలనుకున్న బస్సులను పక్కన బెట్టి ప్రైవేటు వైపు అడుగులు వేస్తే తమ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ స్థలాలను కాపాడేందుకు తమ వంతు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఆర్టీసీ స్థలాలను కొంతమంది పరిశ్రమల యజమానులు లీజుకు తీసుకున్న నేపథ్యంలో వారి నుంచి కాపాడే దిశగా యాజమాన్యం అడుగులు వేస్తోందంటున్నారు ఎండీ తిరుమలరావు.. మిగితా ఆయన మాటల్లోనే విందాం. కొత్తగా బస్సులు ప్రవేశపెట్టే దిశగా ఆర్టీసీ అడుగులు వేస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తారని ఆశిద్దాం.

Show Full Article
Print Article
Next Story
More Stories