Kotamreddy: ఏ పోలీస్‌ స్టేషన్‌కైనా వస్తా.. ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు

Nellore Rural MLA Kotamreddy Sridhar Reddy Once Again Fired At The Police
x

Kotamreddy: ఏ పోలీస్‌స్టేషన్‌కైనా వస్తా.. ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు

Highlights

Kotamreddy: పోలీసులతో వాగ్వాదానికి దిగిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Kotamreddy: పోలీసులపై నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. తనను లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ ఆగ్రహించారు. ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు.. అంటూ ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హౌస్ అరెస్ట్ చేస్తూ పోలీసులు ఇచ్చిన నోటీసును ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తిరస్కరించారు. ఈ సందర్భంగా పోలీసులతో శ్రీధర్ రెడ్డి తన నివాసం వద్ద వాగ్వాదానికి దిగారు.

మరోవైపు నెల్లూరు ఆర్టీసీ డిపో వద్ద టీడీపీ నాయకులు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి తన అనుచరులతో ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం. అన్యాయం అంటూ ఆరోపించారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు పట్టాభికి మధ్య తోపులాట జరిగింది. అనంతరం పోలీసులు పట్టాభిని అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories