Andhra Pradesh: ఏపీలో 10వేలకు చేరువలో రోజువారీ కేసులు

Near To 10 Thousand Daily Corona Cases in Andhra Pradesh
x

కరోన వైరస్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Andhra Pradesh: రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు * మంత్రి ఆళ్లనాని నేతృత్వంలో ఐదుగురు మంత్రులతో ఉపసంఘం

Andhra Pradesh: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య 10వేలకు చేరువవుతోంది. అలాగే.. మరణాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంత్రి ఆళ్లనాని నేతృత్వంలో ఐదుగురు మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేసింది. కాసేపట్లో మంగళగిరిలోని ఏపీఐఐసీ బిల్డింగ్‌లో మంత్రివర్గ ఉపసంఘం తొలిసారిగా భేటీ కానుంది. రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనుంది.

ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు అందుతున్న చికిత్స, కమాండ్‌ కంట్రోల్‌ పర్యవేక్షణ వంటి అంశాలపై ఉపసంఘం చర్చించనుంది. ఇక రాష్ట్రంలో కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ను పునరుద్ధరించింది ఏపీ సర్కార్‌. 21 మంది కీలక ఉన్నతాధికారులకు అటాచ్‌ చేస్తూ ఆదేశాలిచ్చింది. కమాండ్‌ కంట్రోల్‌ ఛైర్మన్‌గా టీటీడీ ఈవో జవహర్‌రెడ్డిని నియమించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories