Narsipatnam: ఏంటీ దుస్థితి?.. చెప్పుతో కొట్టుకొని తెదేపా కౌన్సిలర్‌ నిరసన..

Narsipatnam Municipal Meeting
x

Narsipatnam: ఏంటీ దుస్థితి?.. చెప్పుతో కొట్టుకొని తెదేపా కౌన్సిలర్‌ నిరసన..

Highlights

Narsipatnam: సొంతవార్డులో కొళాయి వేయించుకోలేని దుస్థితిలో ఉన్నానన్న కౌన్సిలర్‌

Narsipatnam: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పురపాలిక సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఎన్నికై మూడు ఏళ్లు గడిచినప్పటికీ తన సొంత వార్డులో తాగునీటి కొళాయి కూడా వేయించుకోలేని దుస్థితిలో ఉన్నానని 20వ వార్డు కౌన్సిలర్‌ రామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలోనే చెప్పుతో తనకు తాను కొట్టుకొని నిరసన తెలిపారు. ప్రతి సమావేశంలో తన వార్డు సమస్యలు చెప్పుకున్నప్పటికీ ఇప్పటి వరకూ ఏ ఒక్క సమస్యపై దృష్టి సారించకుండా తనను పట్టించుకోవడం లేదని ఆయన వాపోయాడు. తన ఆవేదన ఎలా వ్యక్తం చేయాలో తెలియక చెప్పుతో కొట్టుకునే పరిస్థితి వచ్చిందని కౌన్సిలర్ రామరాజు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories