Breaking News: చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడి మృతి

Nara Ramamurthy Naidu Passed Away
x

Breaking News: చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడి మృతి

Highlights

Nara Ramamurthy Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరులు రామ్మూర్తి నాయుడు శనివారం మరణించారు.

Nara Ramamurthy Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరులు రామ్మూర్తి నాయుడు శనివారం మరణించారు.ఆయనకు భార్య, రోహిత్, గిరిష్ అనే ఇద్దరు కుమారులున్నారు.ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు రామ్మూర్తి చనిపోయారని వైద్యులు ప్రకటించారు.రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమంగా ఉందని తెలుసుకున్న లోకేష్ విజయవాడ నుండి హుటాహుటిన హైద్రాబాద్ కు చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు దిల్లీ నుంచి నేరుగా హైద్రాబాద్ కు వస్తారు.

ఈ నెల 14న కార్డియాక్ అరెస్ట్ తో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆయనకు స్టంట్ వేశారు. ఈ సమస్యతో పాటు శ్వాసకు సంబంధించిన సమస్యలు తలెత్తాయి. ఇవాళ ఉదయం మరోసారి ఆయనకు కార్డియాక్ అరెస్ట్ అయింది. చికిత్స పొందుతూ ఆయన మరణించారు.రేపు నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావులు రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు.1994 నుంచి 1999 వరకు చంద్రగిరి అసెంబ్లీ నుంచి గెలిచారు. 1999లో ఇదే స్థానం నుంచి ఆయన పోటీ చేసి ఓడారు.2004 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామ్మూర్తి నాయుడు టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు.

తమ్ముడు నన్ను విడిచి వెళ్లారు: చంద్రబాబు

తమ్ముడు రామ్మూర్తి నాయుడు తనను విడిచివెళ్లాడని చంద్రబాబు చెప్పారు. ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవలు చేశారు. తమ నుంచి దూరమై కుటుంబంలో ఎంతో విషాదం నింపారని ఆయన అన్నారు.రామ్మూర్తి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories