Nara Lokesh: ఏపీకి మొదటి ర్యాంకు రావటం చంద్రబాబు గారి కృషికి నిదర్శనం
Nara Lokesh|ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే..
Nara Lokesh|ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.. ఆ తరువాత తరువాత రెండో స్థానంలో ఉత్తర ప్రదేశ్, మూడో స్థానంలో తెలంగాణ ఉన్నాయి. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ శనివారం రాష్ట్ర వ్యాపార సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక ర్యాంకింగ్‌ను విడుదల చేసింది. ఉత్తర భారతదేశం నుండి ఉత్తర ప్రదేశ్, దక్షిణ భారతదేశం నుండి ఆంధ్రప్రదేశ్, తూర్పు భారతదేశం నుండి పశ్చిమ బెంగాల్, పశ్చిమ భారతదేశం నుండి మధ్యప్రదేశ్, ఈశాన్య భారతదేశం నుండి అస్సాం మొదటి స్థానంలో ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలలో ఢిల్లీ కి మొదటి స్థానం లభించింది.
అయితే, ఆంధ్రప్రదేశ్ ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో మొదటిస్థానం రావటం పట్ల టీడీపీ నేత నారా లోకేష్ తన హర్షం వ్యక్తం చేసారు. అంతే కాదు, '' బిజినెస్ ర్యాంకింగ్ లో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో రావటం ఆనందకరంగా ఉందని.. దేనికి ఉదాహరణ చంద్రబాబు నాయిడు గారి యొక్క కృషి. బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ - 2019ను సమర్థవంతంగా అమలు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, 2018-19 సంవత్సరానికి 'ఈజీ ఆఫ్ డూయింగ్ ఆఫ్ బిజినెస్'లో ఎపి మళ్లీ అగ్రస్థానంలో ఉంది. వైఎస్ జగన్ మంచి పనిని కొనసాగించగలిగాడు, కానీ అతను ఇవన్నీ రద్దు చేశాడు. విచారంగా!''. అంటూ నార లోకేష్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
This is an example of @ncbn's hard work. AP again topped 'ease of doing business' for the year 2018-19, thanks to its effective implementation of Business Reform Action Plan – 2019. @ysjagan could have continued the good work, but he has undone all of it. Sad! pic.twitter.com/uoaWExIv8p
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) September 5, 2020
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire