దేశ రాజకీయాల్లో కీలకంగా మారనున్న చంద్రబాబు

Nara Chandrababu Naidu Will Become a key Role in the Indian Politics
x

దేశ రాజకీయాల్లో కీలకంగా మారనున్న చంద్రబాబు

Highlights

ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు కీలక పాత్ర పోషించనున్నారు. ఎన్డీయే కూటమిలో గతంలో మాదిరే బాబు కీలకంగా మారే అవకాశం ఉంది.

Nara Chandrababu: సార్వత్రిక సమరంలో బీజేపీ గెలిచినప్పటికీ... మెజారిటీ గతం కంటే తగ్గింది. పదేళ్ల పాటు దేశాన్ని పరిపాలించిన బీజేపీ సింగిల్‌గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి లేకుండా పోయింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం కూటమిలోని పార్టీలపై బీజేపీ ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు కీలక పాత్ర పోషించనున్నారు. ఎన్డీయే కూటమిలో గతంలో మాదిరే బాబు కీలకంగా మారే అవకాశం ఉంది.

దేశంలో అటు ఎన్డీయే ఇటు ఇండియా బ్లాక్‌గా రాజకీయ పార్టీలు అన్ని విడిపోయాయి. రెండు భారీ క్యాంపుల మధ్య హోరా హోరీ పోరు సాగింది. ఎన్డీయేలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ తర్వాత తెలుగుదేశం మినహా మరే పార్టీకి అన్ని సీట్లలో విజయం సాధించలేవు. ఏపీలో ఎన్డీయే 21 స్థానాల్లో గెలుపొందగా... తెలుగుదేశం పార్టీ సింగిల్‌గా 16 సీట్లు సాధించుకుంది. ఈ బిగ్ నంబర్‌తో ఎన్డీయేలో మోడీ తర్వాత చంద్రబాబు కీలకం అయ్యారు.

బీజేపీ సింగిల్‌గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి సరిపడా అన్ని అవకాశాలు బాబుకు ఉన్నాయి. ఎన్డీయే కూటమికి టైట్ మార్జిన్ రావడంతో బాబు పాత్ర అత్యంత కీలకం అయింది. ఇండియా కూటమిలోని మిత్రులను ఈ వైపునకు తీసుకుని వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. తద్వారా రాష్ట్రానికి కావాల్సిన నిధులను కేంద్రం నుంచి తీసుకురాగల సమర్థుడే.

1996 నాటి పరిస్థితులే ఢిల్లీలో చోటు చేసుకున్నాయి. రెండు జాతీయ పార్టీలకు అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోవడంతో ప్రాంతీయ పార్టీల రాజకీయం మొదలయింది. ఆనాడు ప్రాంతీయ పార్టీలను ముందు పెట్టి యునైటెడ్ ఫ్రంట్ అన్న దానికి బాబు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు సైతం బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం లేకపోవడంతో బాబు ఏమి చేస్తారు అనే చర్చ సాగుతోంది. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు కీలకపాత్ర పోషించే తరుణం ఆసన్నమైందని విశ్లేషకులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories