Nadu-Nedu Second Phase in AP: ఏపీలో రెండో దశ నాడు - నేడు.. 14,584 పాఠశాలలకు మహర్ధశ
Nadu-Nedu Second Phase in AP: విద్యా వ్యవస్థను పూర్తిస్ధాయిలో మెరుగుపర్చేందుకు ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి చర్యలు తీసుకుంటున్నారు.
Nadu-Nedu Second Phase in AP: విద్యా వ్యవస్థను పూర్తిస్ధాయిలో మెరుగుపర్చేందుకు ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను నాడు - నేడు కార్యక్రమంతో తీర్చిదిద్దాలని సంకల్పించారు. దీనిలో భాగంగా మొదటి దశకు సంబంధించి 15,715 పాఠశాల రూపు రేఖలు మార్చి, అన్ని వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ పనులు ప్రోగ్రెస్ లో ఉన్నాయి. ఇక రెండో దశలో 14,584 పాఠశాలలను ఇదే విధంగా మార్పులు చేసేందుకు శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి అధికారులతో చర్చించి, తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో రెండో దశ 'నాడు-నేడు' కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ప్రస్తుతం తొలిదశ కింద 15,715 పాఠశాలల్లో పనులు కొనసాగుతుండగా, రెండో దశలో భాగంగా 14,584 స్కూళ్లు, విద్యాసంస్థల్లో రూ.4,732 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. 2021 జనవరి 14న ఆయా పనులను ప్రారంభించి జూన్ నాటికి పూర్తి చేయనున్నారు. మొదటి దశలో చేపట్టిన పనులు ఈ ఏడాది పాఠశాలలు తెరిచే నాటికి పూర్తిచేస్తారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రణాళికను సీఎం జగన్ అధికారులకు వివరించారు. ఇప్పటి వరకు జరిగిన 'నాడు-నేడు' పనులపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. కాగా, 'నాడు-నేడు'లో ఇప్పటి వరకు 9 రకాల పనులు చేస్తుండగా, కొత్తగా 10వ అంశంగా 'కిచెన్'ను చేర్చా రు. స్కూళ్లను తెరిచే రోజు విద్యార్థులకు ఇవ్వనున్న 'విద్యా కానుక' కిట్‌ను సీఎం పరిశీలించారు. వాటి నాణ్యతలో ఎక్కడా రాజీపడొద్దని చెప్పారు. సెప్టెంబరు 5న టీచర్స్ డే రోజు స్కూళ్లు తిరిగి తెరవడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
మనబడి నాడు–నేడు రెండో దశ కార్యక్రమం ప్రారంభానికి సర్వం సిద్ధమవుతోంది. మొదటి దశలో దాదాపు 15వేలకు పైగా పాఠశాలలకు మహర్దశ పట్టింది. రెండో దశలో మరో 14,584 పాఠశాలలు, విద్యాసంస్థలకు కొత్తరూపు తీసుకురానున్నారు.
రెండు నెలల్లో వాటర్ ప్లాంట్లు..
► అన్ని స్కూళ్లలో పిల్లలకు పరిశుభ్రమైన తాగునీరు అందించేలా మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్లాంట్ల నిర్వహణ బాధ్యతను కంపెనీలకు అప్పగించాలన్నారు. అక్టోబర్ నాటికి వాటిని ఏర్పాటుచేస్తామని అధికారులు చెప్పారు.
► నాడు–నేడులో మిగిలిన 31,073 స్కూళ్లు, విద్యా సంస్థలలో దాదాపు రూ.7,701 కోట్ల వ్యయంతో పనులు చేపట్టాల్సి ఉందని సమావేశంలో అధికారులు వెల్లడించారు.
► రెండో దశలో 14,584 స్కూళ్లు, విద్యా సంస్థల్లో పనులకు రూ.4,732 కోట్లు వ్యయమవుతుందని.. ఈ నెలాఖరులోగా వాటిని గుర్తించి, ఈ ఏడాది నవంబర్ 14న పనులు ప్రారంభించి వచ్చే జూన్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
► అదే విధంగా.. మూడో దశలో 16,489 స్కూళ్లు, విద్యా సంస్థల్లో రూ.2,969 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. వచ్చే ఏడాది జూన్ 30 నాటికి వీటిని గుర్తించి, నవంబర్ 14, 2021 నుంచి పనులు ప్రారంభించి 2022 జూన్ 30 నాటికి పూర్తిచేయనున్నారు.
► పనులన్నీ షెడ్యూల్ ప్రకారం కొనసాగించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అందమైన వాల్ పెయింటింగ్స్, బొమ్మలు వేయాలని.. విద్యార్థులను ఆకట్టుకునేలా ప్రతి స్కూల్ ఉండాలని ఆదేశించారు.
► ప్రతి క్లాస్‌రూమ్‌లో అన్నీ రంగుల టేబుల్స్ ఏర్పాటుచేయాలని సూచించారు. – నాడు–నేడు కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తోందని.. ఈ ఏడాది అడ్మిషన్లకు అంచనాలకు మించి స్పందన కనిపిస్తోందని అధికారులు చెప్పారు.
► సెంట్రలైజ్డ్ కిచెన్‌కు సంబంధించిన ప్లాన్లను అధికారులు సమావేశంలో వివరించారు. వీలైనంత త్వరగా వాటిని ఖరారు చేసి, పూర్తి పరిశుభ్రం (హైజిన్)గా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
► వచ్చే నెల 5న స్కూళ్లు తిరిగి తెరవడానికి అన్ని ఏర్పాట్లుచేయాలని, ఈలోగా ఈ పనులన్నీ పూర్తికావాలన్నారు. ఆ రోజు ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి ఘనంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. అయితే, పాఠశాలలు ప్రారంభించే నాటికి మినరల్ వాటర్ ప్లాంట్లు మినహా మొదటి విడత నాడు–నేడు పనులన్నీ పూర్తవుతాయని.. వాటర్ ప్లాంట్లను అక్టోబర్ మొదటి వారానికల్లా పూర్తిచేస్తామని అధికారులు చెప్పారు.
'నాడు–నేడు'లో భాగంగా విశాఖ జిల్లా గిడిజాలలో నిర్మించిన తరగతి గదిలో ఏర్పాటు చేసిన టేబుళ్లు, కుర్చీలు జగనన్న విద్యా కానుక పరిశీలన. స్కూళ్లు తెరిచే రోజు (సెప్టెంబరు 5)న విద్యార్థులకు ఇవ్వనున్న జగనన్న విద్యా కానుక కిట్ మొత్తాన్ని సీఎం జగన్ పరిశీలించారు. పిల్లలకిచ్చే బ్యాగ్, బుక్స్, నోట్‌బుక్స్, బూట్లు, సాక్సులు, యూనిఫామ్ క్లాత్‌లను చూసి అధికారుల పనితీరును ప్రశంసించారు.
తొలిదశ ప్రగతిని వివరించిన అధికారులు
కాగా, తొలిదశ నాడు–నేడు కింద వివిధ స్కూళ్లలో చేపట్టిన పనులను అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వివరించారు.
► కృష్ణాజిల్లా కంకిపాడు పంచాయతీలోని కోలవెన్నులో 1938లో కట్టిన పాఠశాలను కూల్చేయాలని తల్లిదండ్రుల కమిటీ నిర్ణయించగా, నాడు–నేడులో పూర్తి రూపురేఖలు మార్చి నాడు–నేడు పరిస్థితులను ప్రదర్శించారు.
► అలాగే, వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం రామచంద్రాపురం మండల పరిషత్ పాఠశాల, విశాఖ జిల్లా గిడిజాల జెడ్పీ హైస్కూల్‌తోపాటు మరికొన్ని పాఠశాలల ఫొటోలను కూడా సీఎంకు చూపించారు. సమీక్షలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్‌తో పాటు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire