Andhra Pradesh: ఏపీలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికలు

Municipal Elections Ended in Andhra Pradesh
x

Representational Image

Highlights

Andhra Pradesh: 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాల్టీల్లోని * 1633 వార్డులు, 582 డివిజన్లకు ఎన్నికలు

Andhra Pradesh: ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాయి. 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాల్టీల్లో ఎన్నికలు జరిగాయి. ఒకవేయి 633 వార్డులు, 582 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. విజయనగరం, విశాఖ, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కడప కర్నూలు, అనంతపురం కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఇక.. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 53.57 శాతం పోలింగ్‌ నమోదైంది. పలుచోట్ల మందకొడిగా పోలింగ్‌ కొనసాగినట్టు తెలుస్తోంది.

విజయవాడ కార్పొరేషన్‌ పరిథిలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటలవరకు 64 డివిజన్లలో 52.87 శాతం పోలింగ్ మాత్రమే నమోదయింది. ఎన్నికల దృష్య్టా నగరంలో ముందస్తు సెలవు ప్రకటించినప్పటికీ ఓటింగ్‌లో పాల్గొనేందుకు ప్రజలు ముందుకు రాలేదు. దీంతో అభ్యర్థులతో పాటు, రాజకీయ పార్టీలు అయోమయంలో పడ్డాయి. కాగా ఈ నెల 14న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories