Muharram in AP: కరోనా నేపధ్యంలో 'మొహర్రం' నిర్వహణకు ఏపీ గైడ్ లైన్స్

Muharram in AP: కరోనా నేపధ్యంలో మొహర్రం నిర్వహణకు ఏపీ గైడ్ లైన్స్
x
Muharram in AP
Highlights

Muharram in AP: మొహర్రం నిర్వహణకు కోవిడ్ నేప‌థ్యంలో గైడ్ లైన్స్ విడుదల చేస్తూ ఏపి మైనారిటీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 20వ తేదిన ముస్లిం సోదరులు మొహర్రం

Muharram in AP: మొహర్రం నిర్వహణకు కోవిడ్ నేప‌థ్యంలో గైడ్ లైన్స్ విడుదల చేస్తూ ఏపి మైనారిటీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 20వ తేదిన ముస్లిం సోదరులు మొహర్రం నిర్వహించుకుంటున్నందున గైడ్ లైన్స్ ను విడుదల చేయాలని వక్ఫ్ బోర్డ్ సిఈవో చేసిన విజ్ఞప్తి మేరకు ఈ ఉత్తర్వులు ప్రభుత్వం విడుదల చేసింది.

జీవోలో పేర్కొన్న నిబంధనలు ఇవే..

- ఆరు అడుగుల భౌతికదూరం పాటించాలి. మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలి.

- వ్యక్తిగత శుభ్రత పాటించాలి. రోడ్ల పై పబ్లిక్ ప్లేస్ లలో ఉమ్మి వేయరాదు

- దీంతో పాటు ఆలంలను పీర్లచావిడి వద్ద ఏర్పాటు చేయడానికి పది మందిని మాత్రమే వినియోగించాలి

- మసీద్ లో 30 నుంచి 40 మంది మాత్రమే భౌతికదూరం పాటిస్తూ ప్రార్ధనలు నిర్వహించవచ్చు.

- వీలు ఉన్నంతంవరకు ఎవరిళ్ల వద్ద వారే ఈ కార్యక్రమాలను నిర్వహించాలి.

- పీర్లు చావిడి వద్ద శానిటైజర్లు సరిపడినంత అందుబాటులో ఉంచాలి.

- దగ్గు, జలుబు, జ్వరంతో ఉన్న వృద్దులు, చిన్నారులు పీర్ల చావిడి వద్దకు రాకూడదు.

- చక్కెర వ్యాధి, బీపీ, గుండె సంబంధ వ్యాధులున్న వారు ఫతేహాను వారి ఇళ్ల వద్దే నిర్వహించాలి.

- పీర్ల చావిడి వద్ద ఉర్దూలో, తెలుగులో కోవిడ్ -19 నిబంధనలు తెలియజేసేలా బోర్డులు ఏర్పాటు చేయాలి.

- కోవిడ్ -19 నిబంధనలను మైక్ లో ఎప్పటికప్పుడు అనౌన్స్ చేయాలి.

- ఆర్కెస్ట్రాలు, సన్నాయి మేళాలు, ఏర్పాటు చేయకూడదు.

- మొహర్రం సందర్భంగా సంప్రదాయబద్దంగా ఏర్పాటు చేసే అగ్నిగుండాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు.

- ఉచిత మంచినీటి సరఫరా స్టాళ్లను ఏర్పాలు చేయకూడదు...వాటర్ బాటిల్, వాటర్ ప్యాకెట్లును మాత్రమే అందించాలి.

ఈ నిబంధనలను మొహర్రం సందర్భంగా ఖచ్చితంగా పాటించేలా అన్ని విభాగాల అధిపతులకు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తూ మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మహ్మమద్ ఇలియాస్ రిజ్వి ఉత్తర్వులు జారీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories